దండకారణ్యంలో కొత్త వ్యూహాలు

– ‘గిరిదర్శక్ గైడ్’పై అనుమానాలు
– దండకారణ్యంలో ‘సల్వాజుడుం 2.0’
– కార్పొరేట్ శక్తుల కోసమే ‘ఆపరేషన్ కగార్’
– అరణ్య రోదనగా ఆదివాసీల పోరాటాలు?

                                                                                   (తోటకూర రమేష్)

‘ఆపరేషన్ కగార్’తో మధ్య భారత్ లో మావోయిస్టు ఉద్యమాన్ని బలహీనపర్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దండకారణ్యంలోని విలువైన సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేం దుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఛత్తీస్ గఢ్, ఒడిశాలో విలువైన భూములు అదానీ అంబానీ వంటి వంటి కంపెనీలకు కేం ద్రం ధారాదత్తం చేసింది. ఇప్పటికే కంపెనీలు లక్షల ఎకరాల్లో మైనింగ్ చేస్తే కోట్ల చెట్లను నరికివేస్తోన్నాయి. ఎన్నో దశాబ్దాలుగా ఆదివాసులు ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. పీపుల్స్ వార్ మైదానం నుంచి దండకారణ్యంలోకి ఎంట్రీ కావడం. అనేక విప్లవ గ్రూప్ లు కలిసి మావోయిస్టుగా రూపాంతరం చెందడంతో ఏళ్లతరబడి పోరాడుతూ అలిసిపోయిన భూమి పుత్రులకు కొండంత బలంగా నిలిచింది. కొంతకాలంగా రకరకాల పోలీస్ ఆపరేషన్ల తో మావోయిస్టు పార్టీని నిర్మూలించడంతోపాటు మావోయిస్టు పార్టీకి ఆదివాసుల మధ్య దూరం పెంచారు. అయితే ‘అపరేషన్ కగార్’తో మావోయిస్టు ఉద్యమం బలహీనపడినా ఆదివాసుల పోరాటం మాత్రం ఆగడం లేదు. మావోయిస్టు పార్టీ ఉనికే లేదంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రటించినప్పటికీ జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్ గఢ్ సహా మొత్తం దండకారణ్యంలో మూలవాసులు అదానీ, అంబానీల వంటి కార్పొరేట్ కంపెనీల సంపద దోపిడీకి, పచ్చని అడవిలో సృష్టిస్తున్న విధ్వంసాకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు. మావోయిస్టులను అడవి నుంచి, ఆదివాసుల నుంచి దూరం చేస్తే ఇక మధ్య భారత్ లోని విలువైన సంపద దోచుకునేందుకు అడ్డే ఉం డని ప్రభుత్వాలు దశాబ్దాలుగా అనేక ఆపరేషన్లతో దండకారణ్యంపై సైనిక దండయాత్రకు కేంద్రం దిగింది. మావోయిస్టులు లేకపోతే ఆదివాసుల పోరాటం అరణ్య రోదనగానే మిలిగిపోతుందని భావించిన ప్రభుత్వాలు మావోయిస్టు రహిత భారత్ ఎజెండాను అమలు చేశారు. ఆదివాసులకు, అడవికి దూరం చేయడంలో కొంత వరకూ సక్సెక్ అయ్యారు.
అయితే మావోయిస్టు పార్టీ లేకపోతే ఆదివాసి పోరాటాలుండవనుకున్న కేంద్రానికి మూల వాసులు షాక్ ఇస్తున్నారు. తమ కాళ్ల కిందున్న దేశ సంపదను దోచుకునేందు కుట్రలు చేస్తున్న ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై తమ పోరాటం కొనసాగుతుందని ఇటీవలే అక్కడ జన తిరుగుబాటుతో స్పష్టం చేస్తున్నారు. మావోయిస్టులు వచ్చిన తర్వాతనే తమ పోరాటం మొదలు కాలేదని, అంతకు ముందు ఎన్నో ఏళ్ల నుంచి రాజ్యాలు, ప్రభుత్వాలతో పోరాడుతున్నామని. ఇక ముందు కూడా కొనసాగుతుందని ప్రకటిస్తున్నారు. కొత్త సంస్థలు రకరకాల పేర్లతో పుట్టుకొస్తున్నాయి..
కేంద్ర లక్ష్యం నెరవేరకపోగా ఇప్పుడు కొత్త సంస్థలు, తీవ్రమైతున్న ఆదివాసుల పోరాటాలతో -ప్రభుత్వం ఉల్లిక్కిపడుతుంది. మావోయిస్టులు లేకపోతే అడ్డులేదనుకుంటే ఈ కొత్త చిక్కులేంటనీ మథన పడుతుంది, ఐదా మల్టీనేషనల్ కంపెనీల బాధ ప్రభుత్వం బాధగా మారింది. ఒక -సమస్యకు తాత్కాలిక పరిష్కారం దొరికిందనుకుంటే ఈ కొత్త సమస్య ఏంటనీ కేంద్రంపై బడా కంపెనీలు ఒత్తిడి పెంచుతున్నాయి.
దీంతో కేంద్ర ప్రభుత్వం కొత్త ఆలోచనల చేసింది. ఆదివానుల పోరాటాలను అణచివేసేందుకు సయా ఎత్తుగడ వేసింది.. ఇన్ని రోజులు మధ్య భారత దేశంలో తమ ఆటవి హక్కులు, దేశ సంపదను కార్పొరేట్ శక్తుల హస్తగతం కాకుండా కాపాడుతున్న ఆదివాసులకు మద్దతుగా నిలబడి, ఆపరేషన్ కగార్తో ప్రభుత్వాల ముందు లొంగిపోయిన మాజీ మావోయిస్టులను ఆదివాసుల పోరాటానికి వ్యతిరేకంగా ఉపాధి పేరుతో అణచివేసే ప్రయత్నం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి.
ఇందులో భాగంగానే గిరిదర్శన్ గైడ్ అంటూ తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీలకు ఉపాధి కల్పించేందుకు సిద్ధమైంది. టూరిజం శాఖతో కలిసి ఇప్పటికీ మాజీలకు శిక్షణ కూడా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే ఇక్కడ కేంద్ర రాష్ట్రాల కుట్రలున్నాయి. లొంగిపోయిన మాజీలకు ఉపాధి పేరుతో ఎస్ఐబీ ఉద్యోగాలు ఇవ్వడం అనేక అనుమానాలకు దారి తీస్తుంది. మాజీ నక్సలైట్లకు ఉ ద్యోగాలు, ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ముందు అనేక అవకాశాలున్నాయి. కానీ గిరిధర్శక్ గైడ్ పేరుతో దండకారణ్యంలో వారిని నియమించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ములుగు, భద్రాచలం, కర్రెగుట్టలో మాజీలు గిరిధర్శక్ గైడ్లుగా పని చేస్తారని ప్రకటించింది.
ఎస్ఐబీ ఆధ్వర్యంలో ఉద్యోగాలు, అందులోనూ గిరిధర్శన్ గైడ్ పేరుతో ఆదివాసులు కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ప్రాంతంలో గైడ్గా నియమించడం అంటే ఆదివాసుల పోరాటంపై నిఘా పెట్టడమే కాదు, ఆ పోరాటాలను అణచివేసేందుకు ప్రభుత్వం పన్నుతున్న వ్యూహం కూడా. అంతేకాదు, గిరిధర్శక్ గైడ్ అనేది కేంద్రం తీసుకున్న ప్రోగ్రామ్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఇది తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమమైతే గిరిదర్శక్ వంటి హిందీ పేరు పెట్టే అవకాశం లేదు. అయితే తెలంగాణ ఎస్బబీ దేశంలో మిగతా నిఘా సంస్థల కంటే పవర్ ఫుల్ కావడంతో కార్పొరేట్ కంపెనీల కోసం కేంద్రం -తెలంగాణ ఎస్ఐబీని ముందుపెట్టి ఈ ఆపరేషన్ మొదలుపెట్టినట్లు అర్ధమైతోంది. మరోవైపు మావోయిస్టు పార్టీని విభజించిన కేంద్రం. ఇప్పుడు మైదాన ప్రాంతానికి వచ్చిన మాజీలతో అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులను అణచివేత పోరాటాల్లో ఆయుధంగా మార్చుకునే వ్యూహాన్ని కేంద్రం అమలు చేస్తుంది. అయితే కేంద్రం వ్యూహం ఎంత వరకూ సక్సెక్ అవుతుందన్నది మాజీల వ్యవహార శైలి వారు వేసే అడుగులను బట్టి కాలమే నిర్ణయిస్తుంది. ఇప్పటికే ఆదివాసుల పోరాటాలను నిర్మూలించేందుకు అనేక సంఘాలను కేంద్రం ప్రోత్సహిస్తుంది.. తిరుగుబాటు గ్రూప్ ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు కొత్తగా మాజీలను కూడా చేర్చే ప్రయత్నం చేస్తుంది.
అయితే తెలంగాణ నుంచి ఒకరిద్దరూ అగ్రనేతలు తప్ప పీపుల్స్ వార్ గ్రూప్ నేతలందరూ సరెండర్ అయ్యారు. ఇప్పుడున్న అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు నేతలంతా చత్తీస్గడ్, జార్ఖండ్ కు చెందిన వారే క్రియాశీలకంగా ఉన్నారు.. కేంద్రం ఎంత నిర్భంధం ప్రయోగించిన లొంగిపోలేదు.. పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. అయితే వారి పోరాటం ప్రస్తుతం గతంలో లాగా యాక్టీవ్ గా లేదు. అయితే భవిష్యత్లో యాక్టీవ్ కాకుండా ఉండేందుకు ఈ మాజీలను గిరిదర్శక్ గైడ్ పేరుతో ఎస్ఐబీ వారిపై నిఘా పెట్టి మళ్లీ యాక్టివ్ కాకుండా కేంద్రం ప్లాన్ చేస్తున్నట్లుంది. మావోయిస్ట్ పార్టీలో విభేదాలు సృష్టించిన కేంద్రం మాజీలతోనే పోరాటం. చేస్తున్న వారిని అణచివేసే ఎజెండాను అమలు చేస్తున్నట్టుంది.
మరోవైపు లొంగిపోయిన మాజీల్లో కొందరు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని, రాజ్యాంగ పరిధిలో ఉద్యమాలు చేస్తామని లోంగుబాటు సమయంలో ప్రకటించారు. ప్రభుత్వాలు మళ్లీ అణచివేస్తే తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లడానికి కూడా వెనుకడుగు వేయమని ప్రకటించారు. అయితే మాజీలు ప్రజా ఉద్యమాల్లో యాక్టివ్గా ఉండకుండా ఉపాధి పేరుతో గైడ్లుగా మార్చే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తున్నట్లుంది. ప్రభుత్వం రాడార్లో ఉంటునే ప్రజా ఉద్యమాలకు దూరం చేసే ఎజెండా కూడా కావచ్చు. అయితే మాజీలు ఏ లక్ష్యంతో బయటకు వచ్చి ప్రభుత్వాల ముందు లొంగిపోయారో ఆ లక్ష్యాలు నెరవేరకపోతే వాళ్లు మళ్లీ ప్రజా ఉద్యమాలు నిర్మించవచ్చు. గిరిదర్శక్ పేరుతో వాళ్లను అడవుల్లో గైడ్గా మార్చాలని కేంద్రం భావిస్తుందో అది ప్రభుత్వానికి షాక్లు ఇవ్వవచ్చు. నీటిలో ఉన్న ముసలి, పుట్టలో ఉ న్న ఉడుము ఎంత బలమైనవో.. అడవిలో ఉన్న అన్నలు అంతేబలమైనవారు. కగార్ పేరుతో వారిని మైదాన ప్రాంతంలోకి తీసుకువచ్చి, ఏ ప్రజా పోరాటల్లో అయితే తాము భాగస్వామ్యం అవుతామని ప్రకటించారా ఆ లక్ష్యం నెరవేరకపోతే బయట ఉన్న ముసలిని నీటిలోకి పంపినట్లే అవుతుంది. వాళ్లు గైడ్ల రూపంలో మళ్లీ అడవుల్లోనే కాదు వచ్చే టూరిస్టులతో మరో ఉద్యమాన్ని కూడా నిర్మించే అవకాశం ఉంది.


లొంగిపోయిన వారికి పునరావాసం- గిరిదర్శక్ గైడ్‌లుగా శిక్షణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28: రాష్ట్రంలో లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు ముగింపు దశకు చేరుకున్నాయి. పర్యాటక శాఖలో గిరి దర్శక్ గైడ్‌ల పేరుతో వారికి ఉద్యోగాలు కల్పించింది. వారంతా కర్రెగుట్టలు, భద్రాచలం, ములుగు జిల్లాల్లో విధులు నిర్వర్తించనున్నారు. అందుకోసం వారికి నెల రోజులపాటు తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఎసఐబీ), పర్యాటక శాఖ సంయుక్తంగా శిక్షణ అందించాయి. ఈ శిక్షణ పూర్తి కావడంతో వారిని పర్యాటక శాఖ కొలువుల్లోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా మావోయిస్టులు లొంగిపోయి జన జీవన స్రవంతిలో కలిసి దేశాభివృద్ధికి పాటుపడాలని కేంద్రం పిలుపునిచ్చింది. అందుకోసం ’ఆపరేషన్ కగార’ను తెరపైకి తీసుకు వచ్చింది. లొంగిపోయిన మావోయిస్టులకు నగదుతోపాటు పునరావాసం కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రకటించాయి. దీంతో ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ ప్రభుత్వాల ఎదుట మావోయిస్టులు భారీగా లొంగిపోయారు. తెలంగాణ ప్రభుత్వం వారిని గిరి దర్శక్ గైడ్‌లుగా పర్యాటక శాఖలో ఉద్యోగాలు కల్పించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *