– సినీ నటుడు ప్రకాష్ రాజ్
న్యూదిల్లీ, అక్టోబర్ 3 : ‘సర్’ పేరుతో తొలగించిన వోట్లన్నింటిని తిరిగి వోటర్ల జాబితాల్లో పునరుద్ధరించాలని నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాష్రజ్ డిమాండ్ చేశారు. దేశవ్యా ప్తంగా వివాదాస్పదమైన వోటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్దేశ పూర్వకంగానే కొందరి ఓట్లను తొలగించేందుకు ఈ ప్రక్రియ చేపట్టారని ఆరోపించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని విమర్శిం చారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ప్రకాష్జ్ డిమాండ్ చేశారు. ఇప్పటికే ఏటా వోటర్ల జాబితా పరిశీలన జరుగుతుం డగా.. కొత్తగా ఈ ప్రత్యేక సవరణ ఎందుకని ఆయన ప్రశ్నించారు. దేశంలో అక్రమ చొరబాటుదారులు ఉంటే ఇన్నాళ్లూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏం చేసింది అని ప్రకాష్ రాజ్ నిలదీశారు. ఇంట్లో లేని వాళ్ల వోట్లను తీసేశారని మండిపడ్డారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



