– నీట్ లీకేజీపై చర్చపై కుదరని ఏకాభిప్రాయం
– ధర్మేంద్ర రాజీనామా చేయాల్సిందేనని పట్టు
– విపక్షాల పట్టుతో పార్లమెంట్ నేటికి వాయిదా
– పార్లమెంట్ వెలుపల పరస్పర నినాదాలు
న్యూదిల్లీ, జూలై 23: పార్లమెంటులో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. గురువారం ప్రారంభమైన రెండు నిముషాలకే ఉభయసభలు తొలుత 12గంటలకు వాయిదా పడ్డాయి. అనంతరం సమావేశమైనా సభలు సాగలేదు. ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేస్తేనే చర్చకు అంగీకరిస్తామని రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే తెగేసి చెప్పారు. నీట్ పేపర్ లీక్ అంశంపై ప్రతిపక్షాల నిరసనల నడుమ లోక్‌సభ నేటికి వాయిదా పడింది. రాజ్యసభను కూడా మధ్యాహ్నం మూడు గంటల వరకూ వాయిదా పడింది. నీట్ పేపర్ లీక్ ఉదంతానికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం ప్రారంభించాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టాయి. ఈ క్రమంలో సభ పలుమార్లు వాయిదా పడింది. పేపర్ లీక్ జరిగినట్టు ప్రభుత్వం అంగీకరిస్తే వెంటనే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు.
రూల్ 267 కింద చర్చ చేపట్టాలని కోరుతుంటే ప్రభుత్వం అంగీకరించట్లేదని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కేంద్రం అవమానించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తరువాతే తాము ఏ చర్చకైనా సిద్ధమని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల తీరుపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. నీట్‌పై చర్చ నుంచి తప్పించుకోవాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని ఆరోపించారు. చర్చ ముందు షరతులు పెట్టడం భావ్యం కాదని అన్నారు. ఈ అంశంపై తన వాదన వినిపించే హక్కు ప్రభుత్వానికి కూడా ఉంటుందని అన్నారు. ఇదిలావుంటే పార్లమెంట్ వెలుపల విపక్షాలు, బిజెపిలు పరస్పర ఆందోళనలకు దిగారు. నిరసలనతో హోరెత్తించారు. కాంగ్రెస్ ఇండియా కూటమి ఒకవైపు, ఎన్‌డిఎ నేతలు మరో వైపు నిలబడి నినాదాలు చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




