గజం భూమి ఎక్కువ ఉన్నా సరెండర్ చేస్తా

– సీఎం ప్రస్తావించిన అందరి భూములపై సీబీఐ విచారణ జరపాలి
– గుంపు మేస్త్రీతో గుంటనక్క కుమ్మక్కు ముమ్మాటికీ వాస్తవం
– తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : తాను ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న భూముల కన్నా గజం భూమి ఎక్కువ ఉన్నా ప్రభుత్వానికే సరెండర్ చేస్తానని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తేల్చి చెప్పారు. అసెంబ్లీలో 22ఏపై బుధవారం జరిగిన చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబానికి ఎక్కడో భూములు ఉన్నట్టు ప్రస్తావించిన అంశంపై ‘ఎక్స్‌’ వేదికగా ఆమె స్పందించారు. అసెంబ్లీలో సీఎం ఎవరెవరి పేర్లు ప్రస్తావించి వారికి ఎక్కువ భూములు ఉన్నట్లు చెప్పారో వారందరిపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. అయితేû వారందరిపై సరైన విచారణ జరిపిస్తారన్న నమ్మకం తనకు లేదన్నారు. సీఎం చదివిన భూముల చిట్టాలో నిజాలు నిగ్గు తేలాలంటే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ‘సీఎం ఈ రోజు అసెంబ్లీలో ప్రస్తావించిన గుంట నక్క, కేసీఆర్ ఫాం హౌస్‌లో ఉండే సీఎం గూఢచారి సహా నవీన్ రావు, కొండల్ రావు, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్ రెడ్డి, రామేశ్వర్ రావు, ప్రతిమ శ్రీనివాస్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి సహా అందరి భూములపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలి అని డిమాండ్ చేశారు. తాను ఎప్పటినుంచో చెప్తున్నట్టుగా గుంపు మేస్త్రీ – గుంటనక్క కలిసే ఉన్నారని మరోసారి స్పష్టం చేశారు. వారిద్దరూ కలిసే ఈ డ్రామాలు చేస్తున్నారని కవిత మండిపడ్డారు. నిబంధనలు అతిక్రమించి తనకు గజం భూమి ఎక్కువగా ఉన్నా, ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న భూమి కన్నా గజం అదనంగా ఉన్నట్టు తేలినా ఆ భూములు ప్రభుత్వానికి సరెండర్ చేస్తానని మరోసారి స్పష్టం చేస్తున్నానన్నారు.
———————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *