– 1.08 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల
– 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు
జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బరాజ్ కు వరద నీరు భారీగా వస్తోంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా బరాజ్ కు వరద పెరుగుతోంది. మంగళవారం 94,640 క్యూసెక్కుల ప్రవాహం రాగా బుధవారం 1.08,500 క్యూసెక్కులకు పెరిగింది. మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బరాజ్ గరిష్ట నీటి ప్రవాహం ఎత్తు రివర్ బెడ్ నుండి సముద్ర మట్టానికి 100 మీటర్లు కాగా, ప్రస్తుతం 90.50 మీటర్ల ఎత్తులో ఉందని భారీ నీటిపారుదల శాఖ ఈఈ సురేశ్ తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





