– 15 వరకు దరఖాస్తుల స్వీకరణ
– ఇప్పటివరకు 46,121 దరఖాస్తులు
– వరుస సెలవుల నేపథ్యంలో మరో ఐదు రోజులు అవకాశం
– గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి
– ఇప్పటివరకు 46,121 దరఖాస్తులు
– వరుస సెలవుల నేపథ్యంలో మరో ఐదు రోజులు అవకాశం
– గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 10: హైదరాబాద్ క్యూర్ పరిధిలోని ప్రజల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో అమలు చేయనున్న ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకానికి దరఖాస్తుల స్వీకరణ గడువును మరో ఐదు రోజులపాటు పొడిగిస్తున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈనెల 15వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు వెల్లడించారు. అత్యంత విలువైన ప్రభుత్వ భూములను ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చి నామమాత్రపు ధరలోనే పేద, మధ్యతరగతి ప్రజలకు సొంత ఇంటిని అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పథకం కింద లక్ష ఇళ్లను నిర్మిస్తున్నామని, అందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా 16 నియోజకవర్గాల్లో 7,340 ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టామని ఆయన వివరించారు. ఈ ‘టవర్స్’కు ప్రజల్లో విశేష స్పందన లభిస్తోందని, పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందుతున్నాయని పేర్కొన్నారు. అయితే రెండో శనివారం, బోనాల పండగ తదితర వరుస సెలవుల కారణంగా దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించాలంటూ వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో దరఖాస్తుల స్వీకరణ గడువును మరో ఐదు రోజులపాటు పొడిగించినట్లు వెల్లడించారు. తొలుత ప్రకటించిన ప్రకారం దరఖాస్తుల స్వీకరణ గడువు 10వ తేదీ వరకు ఉంది. గత నెల 21 నుంచి మీ-సేవ కేంద్రాలతోపాటు ఆన్‌లైన్ ద్వారా, మీ-సేవ వాట్సాప్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. సోమవారం సాయంత్రం నాటికి మొత్తం 46,121 దరఖాస్తులు అందినట్లు మంత్రి తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి అన్ని అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేయాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల స్వీకరణ గడువును పెంచినప్పటికీ దరఖాస్తుల పరిశీలన, అర్హత నిర్ధారణ, కేటాయింపు, లాటరీ తదితర ప్రక్రియల్లో ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు. నెలాఖరు నాటికి ఇళ్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఇళ్ల కేటాయింపు ప్రక్రియపై దరఖాస్తుదారులు ఎలాంటి అపోహలు, అనుమానాలకు గురికావాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు. అర్హత ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి పారదర్శకతతో, నిష్పక్షపాతంగా ఇళ్ల కేటాయింపు ప్రక్రియను నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
నియోజకవర్గాల వారీగా వచ్చిన దరఖాస్తులు
నియోజకవర్గం దరఖాస్తులు
అంబర్‌పేట 3,073
బహదూర్‌పుర 1,706
ఇబ్రహీంపట్నం 1,031
కార్వాన్ 2,184
ఖైరతాబాద్ 5,518
కూకట్‌పల్లి 6,615
మహేశ్వరం 734
మలక్‌పేట 3,609
మల్కాజిగిరి 1,333
మేడ్చల్ 1,668
నాంపల్లి 4,372
కుత్బుల్లాపూర్ 5,571
రాజేంద్రనగర్ 2,060
సనత్‌నగర్ 1,404
సికింద్రాబాద్(కంటోన్మెంట్) 1,755
శేరిలింగంపల్లి 3,488
మొత్తం 46,121
అంబర్‌పేట 3,073
బహదూర్‌పుర 1,706
ఇబ్రహీంపట్నం 1,031
కార్వాన్ 2,184
ఖైరతాబాద్ 5,518
కూకట్‌పల్లి 6,615
మహేశ్వరం 734
మలక్‌పేట 3,609
మల్కాజిగిరి 1,333
మేడ్చల్ 1,668
నాంపల్లి 4,372
కుత్బుల్లాపూర్ 5,571
రాజేంద్రనగర్ 2,060
సనత్‌నగర్ 1,404
సికింద్రాబాద్(కంటోన్మెంట్) 1,755
శేరిలింగంపల్లి 3,488
మొత్తం 46,121
—————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





