-రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది వోటర్లు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 10: రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎన్యూమరేషన్ (సర్) పక్రియ ముగిసింది. మొత్తం 3,38,26,448 మంది వోటర్లు ఉన్నట్లు అధికారులు తేల్చారు. 73,95,954 మంది వోటర్లను తొలగించినట్లు సమాచారం. ఇప్పటివరకు 2,64,30,494 ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పక్రియ పూర్తయ్యింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 78.14 శాతం డిజిటలైజేషన్ నమోదైంది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 94.30 శాతం డిజిటలైజేషన్ పూర్తయ్యింది. ఆ తర్వాతి స్థానాల్లో మెదక్ 90.54 శాతం, సూర్యాపేట 90.43 శాతంతో ఉన్నాయి. ఇక, హైదరాబాద్ 27,74,687 ఎన్యూమరేషన్ ఫారాలతో 58.58 శాతం డిజిటలైజేషన్ పూర్తయి చివరి స్థానంలో నిలిచింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 63.82 శాతం, రంగారెడ్డి జిల్లాలో 64.91 శాతం, కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో 89.45 శాతం, జగిత్యాల జిల్లాలో 89.60 శాతం డిజిటలైజేషన్ పూర్తయ్యింది. రెండుసార్లు గడువు పొడిగించినప్పటికీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో డిజిటలైజేషన్ శాతం పెరగలేదు. ‘సర్’ పక్రియ పూర్తయినట్లు ఈనెల 12న సీఈవో ప్రకటన చేయనున్నట్లు, 17న ముసాయిదా వోటర్ల జాబితా విడుదల కానున్నట్లు సమాచారం. ఆ తర్వాత నెల రోజులపాటు అభ్యంతరాల స్వీకరణ కొనసాగనుంది. అక్టోబర్ 19న తుది వోటర్ల జాబితా విడుదల కానుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు