– 30 నుంచి అక్టోబర్ 15 వరకు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29 : విదేశాలలో ఉన్నత విద్య (మాస్టర్స్/డాక్టరేట్) అభ్యసించాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాత్మా జ్యోతిబాపూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం (ఆగస్టు/సెప్టెంబర్ 2026-ఫాల్ సెషన్) దరఖాస్తుల గడువును పొడిగించారు. గతంలో చివరి తేదీగా నిర్ణయించిన ఈనెల 30 నుండి మరో 15 రోజులపాటు అంటే అక్టోబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు పొడిగించినట్లు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కమిషనర్ బి.బాలమాయాదేవి తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అర్హతలు:
కుటుంబ వార్షిక ఆదాయం- అన్ని మార్గాల ద్వారా కలిపి రూ.5లక్షల కంటే తక్కువగా ఉండాలి
వయోపరిమితి- దరఖాస్తు చేసుకునే సమయానికి 35 సంవత్సరాలు మించరాదు.
పరీక్షలలో కనీస అర్హత మార్కులు: డిగ్రీ కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి. జీఆర్‌ఈ/జిమాట్:జీఆర్‌ఈలో కనీసం 260 మార్కులు లేదా జీ-మాట్‌లో 500 మార్కులు సాధించాలి.
ఆంగ్ల ప్రావీణ్యత పరీక్ష: టోఫెల్‌లో 60 మార్కులు లేదా ఐఈఎల్‌టీఎస్‌లో 6.0 బ్యాండ్ లేదా పీటీఈలో 50 మార్కులు పొంది ఉండాలి.
రిజిస్ట్రేషన్, పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ http://www.telanganaepass.cgg.gov.in ను సంప్రదించగలరు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





