‘చేయూత’ దరఖాస్తుల పరిశీలనకు గడువు పొడిగింపు

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24 : చేయూత సామాజిక భద్రత పెన్షన్లకు కొత్తగా వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు ప్రభుత్వం గడువు పొడిగించింది. ఇప్పటివరకు ఈనెల 25 వరకు ఉన్న గడువును 30 వరకు మరో ఐదు రోజులు పొడిగిస్తూ ‘సెర్ప’ సీఈవో దివ్య దేవరాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. క్షేత్రస్థాయి అధికారులు ‘సర’ విధులు, వినాయక నిమజ్జన ఏర్పాట్లు, ఇతర బాధ్యతల్లో నిమగ్నమై ఉండటంతో నిర్ణీత గడువులో దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయలేకపోతున్నామని వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు చేయూత కొత్త పెన్షన్ దరఖాస్తుల పరిశీలనను పొడిగించిన గడువులోగా పూర్తిచేయాలని ఆమె ఆదేశించారు. అర్హత కలిగిన ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం పరిశీలించి ప్రక్రియను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *