– మృతురాలిని గోదావరిఖనికి చెందిన మానసగా గుర్తింపు
హన్మకొండ, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో కారులో మహిళ మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. బస్టాండ్ సమీపంలో రెండ్రోజులుగా పార్క్ చేసిన కారు నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కారు డిక్కీని ఓపెన్ చేయగా మహిళ మృతదేహం మూటకట్టి ఉంది. కారు నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మృతురాలిని గోదావరిఖనికి చెందిన మానస (33)గా గుర్తించారు. కారును మానస స్నేహితుడు వినోద్ అద్దెకు తెచ్చినట్టు సమాచారం. దీంతో వినోద్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ‘కరీంనగర్‌లో గదిలో ఉన్నప్పుడు మానసకు ఫిట్స్ వచ్చాయి. ఫిట్స్, నోట్లో నుంచి నురగలు వచ్చి ఆమె చనిపోయింది. భయంతో మృతదేహాన్ని ఎల్కతుర్తి వద్ద కారులోనే వదిలి వెళ్లిపోయా‘ అని అతను పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. వినోద్ చెప్పిన విషయాలు నిర్ధారించుకునే పనిలో ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు