దాశరథి కృషి భవిష్యత్‌ ‌తరాలకు స్ఫూర్తి

మాజీ ముఖ్యమంత్రి, బి ఆర్‌ ఎస్‌ అధినేత కేసిఆర్‌ ‌నివాళులు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 05: ‌నా తెలంగాణ కోటి రతనాల వీణ…అని నినదించిన తెలంగాణ కవి రచయిత దాశరథి కృష్ణమాచార్య వర్ధంతి సందర్భంగా బి ఆర్‌ ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌వారి సేవలను స్మరించుకున్నారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన ఉద్యమం లో దాశరథి అందించిన పోరాట స్ఫూర్తి ఇమిడివుందన్నారు. దాశరథి కృషిని గుర్తించిన నాటి బి ఆర్‌ ఎస్‌ ‌ప్రభుత్వం వారి స్ఫూర్తి ని భవిష్యత్‌ ‌తరాలకు అందించటానికి పలు కార్యక్రమాలు చేపట్టిందని గుర్తుచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *