పర్యావరణహిత, సుస్థిర అభివృద్ధికి ప్రాధాన్యత

– ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 3 : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు రాష్ట్ర శాసన మండలి ప్రాంగణాన్ని మంగళవారం సందర్శించి అక్కడ ప్రతిపాదించిన అభివృద్ధి, సుందరీకరణ పనుల ప్రణాళికలపై హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలాతో కలిసి పరిశీలించారు. ఈ ప్రాజెక్టులో పర్యావరణహిత, సుస్థిర అభివృద్ధి విధానాలను అనుసరించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ స్పీకర్, శాసనమండలి చైర్మన్, వైస్ చైౖర్మన్, డిప్యూటీ స్పీకర్‌లతోపాటు శాసనసభ కార్యదర్శి, శాసనమండలి కార్యదర్శుల నివాస భవనాల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనల వివరాలను తెలుసుకున్నారు. శాసనసభ ప్రాంగణానికి సంబంధించిన ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్, అనుబంధ భవనం ఏర్పాటు, ఇతర అనుబంధ సౌకర్యాల అభివృద్ధి అంశాలను కూడా తెలుసుకు న్నారు. ప్రస్తుతం పర్యాటక శాఖకు చెందిన భూమిని శాసనసభకు బదిలీ చేయడంతోపాటు పక్కనే ఉన్న డీజీపీ కార్యాలయానికి సంబంధించిన కొంత భూమిని కూడా శాసనసభకు బదిలీ చేసే అంశంపై చర్చించారు. ప్రతిపాదిత అభివృద్ధి పనులకు గుర్తించిన స్థలాలను పరిశీలించారు. అనుబంధ భవనం, పరిపాలనా భవనం, శాసనసభాపక్ష కార్యాలయాలు, విశ్రాంతి భవనం, క్రీడా మైదానం, పార్కింగ్ సౌకర్యాల అభివృద్ధి, విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలపై సమీక్షించారు. ప్రాజెక్టు ప్రతిపాదనలు, ప్రస్తుత స్థల పరిస్థితులు, ఇంజినీరింగ్ అంశాలపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇప్పటికే ఉన్న పచ్చదనానికి ఎలాంటి విఘాతం కలగకుండా పర్యావరణంపై ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తూ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలని తెలిపారు. సీఎస్ వెంట ఆర్డీవో రామకృష్ణ, తహసీల్దార్ నయీముద్దీన్, ఆర్ అండ్ బీ ఎసఈ మాధవి, ఈఈ మనోహర్‌బాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *