రాష్ట్రంలో 2034 వరకు కాంగ్రెస్ శకమే

– ప్రభుత్వ పథకాలతో ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ
– ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం
– కాంగ్రెస్ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డిని గెలిపించాలి
– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

సూర్యాపేట, ప్రజాతంత్ర, నవంబర్ 6 తెలంగాణలో 2024లో ప్రారంభమైన కాంగ్రెస్ పాలన 2034 వరకు కొనసాగుతుందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు వస్తోందని, ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ పెరుగుతోందని తెలిపారు. రానున్న ఎన్నికల్లోనూ పార్టీ ఘన విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. వరంగల్-ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల శాసనమండలి నియోజ కవర్గ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా సూర్యాపేటలో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమా వేశంలో మంత్రి మాట్లాడారు. అర్హులైన కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేయడం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో ఒక మైలురాయి అని మంత్రి పేర్కొన్నారు.
పేద, బలహీన వర్గాలకు నాణ్యమైన ఆహారాన్ని అందించడం ద్వారా ఆహార భద్రతను బలోపేతం చేయడంతోపాటు గౌరవప్రదమైన జీవనానికి ప్రభుత్వం భరోసా కల్పిస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన సమస్యలు, సాగునీటి సవాళ్లు ఉన్నప్పటికీ రాష్ట్రంలో గణనీ యమైన వరి ఉత్పత్తి నమోదైందని తెలిపారు. ఎల్నినో ప్రభావంతో వ్యవసాయ రంగంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు, సాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోందని వివరించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలాన్ని నిరూపించుకునేందుకు కీలకమైన అవకాశమని ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ డ్డికి పట్టభద్రులు మద్దతు తెలిపి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎంపీలు కె. రఘువీర్ రెడ్డి, చామల కిరణ్కుమార్రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఎన్. పద్మావ తిరెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తదితరులు ప్రసంగించారు.

విద్య, వైద్య రంగాల అభివృద్ధికి తొలి ప్రాధాన్యం

జిల్లాలో వైద్య, విద్యా రంగాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సూర్యాపేటలో రూ.190 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నూతన భవన నిర్మాణ పనులను ఆయన శుక్రవారం పరి శలించారు. ఐదు అంతస్తుల్లో వెయ్యి పడకల సామ ర్థ్యంతో నిర్మిస్తున్న ఈ భవన పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మరో రెండు, మూడు నెలల్లో పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు.

రూ.1.17 కోట్లతో వైద్య పరికరాలు 

ఎస్బీఐ, ఐఓసీ, కోటక్ మహీంద్రా, అక్షర ఫౌం డేషన్ సంస్థల సహకారంతో రూ.1.17 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన ఆధునిక వైద్య పరికరాలను మంత్రి ప్రారంభించారు. డిజిట ల్ లైట్ వెంటిలేటర్లు, మైక్రోటోన్, కాటరీ మెషిన్, బ్రోంకోస్కోప్, డెంటల్ చైర్, సీ-ఆర్మ్ తదితర పరికరాలను హాస్పిటల్ కి అందుబా టులోకి తెచ్చారు. అనంతరం కాంపెన్సేటరీ అపాయింట్మెంట్ ప్రక్రియలో భాగంగా పలువురికి నియామక పత్రాలు అందజేశారు.

హైదరాబాద్-విజయవాడ రహదారి ఆరు వరుసలుగా విస్తరణ

హైదరాబాద్-విజయవాడ నాలుగు వరుసల జాతీయ రహదారిని ఆరు వరుసలుగా విస్తరిం చేందుకు మంజూరు చేయించి త్వరలో పను లు ప్రారంభిస్తామని వెల్లడించారు. దేవాదుల ఆరో ప్యాకేజీ కింద తుంగతుర్తి నియోజకవ ర్గానికి రూ.1,000 కోట్లు మంజూరు చేయిం చి సాగునీరు అందిస్తమన్నారు. పాత లిఫ్టుల మరమ్మతులు, కొత్త లిఫ్టుల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ తెల్ల రేషన్ కార్డులు అందించామని, 80 శాతం మంది ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో సూ ర్యాపేట జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు కృషి చేస్తానని చెప్పారు.
కార్యక్రమంలో నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహ, మార్కెట్ కమిటీ చైర్మన్ వేనారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత, జీజీహెచ్ సూప రింటెండెంట్ శ్రవణ్, మాజీ పర్యాటక శాఖ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, వైద్య సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *