హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 6: నేటినుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్పో ప్రారంభిస్తారు. మొత్తం రూ.9,100 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రైతులు, పారిశ్రామికవేత్తలు, స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశామవుతారు. శనివారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేటలోని యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ హబ్ ఆవరణలో మెగా రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్పోను ప్రారంభిస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు. మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఆదర్శ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో ముఖాముఖి సమావేశంలో పాల్గొననున్నారు. సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు పారిశ్రామికవేత్తలతో సమావేశం. 5.30 నుంచి 6.30 గంటల వరకు హకీంపేటఎడ్యుకేషన్ హబ్ పనులను ప్రారంభిస్తారు. రోడ్డు మార్గంలో కొడంగల్ నివాసానికి చేరుకుని రాత్రి అక్కడే బస చేయనున్నారు ఎల్లుండి (8న) ఉదయం 9.30 నుంచి 10.20 గంటల వరకు స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశం కానున్న ముఖ్యమంత్రి. 10.20 గంటలకు పలు అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించనున్నారు. 10.30 కు ఇండస్ట్రియల్ కారిడార్‌లో రూ.81 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఎకోపామ్ పామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తారు. 10.45 కు హకీంపేటలో రూ.4 కోట్లతో నాట్కో సంస్థ సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన జెడ్పీ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాలను, 11 గంటలకు రూ.2.35 కోట్లతో నిర్మించిన హకీంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభిస్తారు. 11.30 గంటలకు బొంరాస్‌పేటలో రూ.4.79 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల, 11.45 గంటలకు రూ.3 కోట్లతో నిర్మించిన పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12.15 గంటలకు కొడంగల్‌లో రూ.3.80 కోట్లతో నిర్మించిన పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం. 12.45 గంటలకు దుద్యాలలో రూ.3 కోట్లతో నిర్మించిన పోలీస్ స్టేషన్‌ను, 1.15 గంటలకు రూ.12 కోట్లతో నిర్మించిన సమీకృత మండల కార్యాలయ భవనాన్ని ప్రారంభించనున్నారు. 1.40 గంటలకు కోస్గి మండలం నాచారంలో రూ.5,060 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న రేడియల్ రోడ్డు–2కు శంకుస్థాపన. 2 గంటలకు కోస్గిలో రూ.6 కోట్లతో నిర్మించిన సైన్స్ మ్యూజియాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2.45 గంటలకు దౌల్తాబాద్ మండలం బాలంపేటలో రూ.2.35 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభిస్తరు. 3.30 గంటలకు దౌల్తాబాద్‌లో రూ.4.79 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రారంభం. అనంతరం కొడంగల్ నివాసానికి చేరుకుని రాత్రి అక్కడే బస చేయనున్న ముఖ్యమంత్రి 9న సాయంత్రం 5 గంటలకు హకీంపేటలో నిర్వహించే భారీ రైతు బహిరంగ సభలో పాల్గొంటారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





