రాజీవ్ దార్శనికతతోనే ఆధునిక భారత నిర్మాణం

– శ్రీపెరంబుదూరులో రాజీవ్ డిప్యూటీసీఎం భట్టి నివాళి

శ్రీపెరంబుదూరు, ఆగస్ట్ 20 : దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో ఉన్న రాజీవ్ గాంధీ మెమోరియల్ వద్ద కర్నాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఘన నివాళులు అర్పించారు. దేశ నిర్మాణంలో రాజీవ్ గాంధీ అందించిన సేవలను ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ తన దార్శనికత, ఆధునిక ఆలో చనలతో భారతదేశాన్ని 21వ శతాబ్దం వైపు
నడిపించారని అన్నారు. ముఖ్యంగా సాంకేతిక, టెలికాం రంగాల్లో విప్లవాత్మక మార్పులకు ఆ యన పునాది వేశారని పేర్కొన్నారు. కం ప్యూటర్లు, ఐటీ రంగాల అభివృద్ధికి ఆయన తీసుకున్న నిర్ణయాలు నేటి డిజిటల్ భారత నిర్మాణానికి బలమైన పునాదిగా నిలిచాయని అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, టెలికాం రంగాన్ని గ్రామస్థాయి వరకు విస్తరించేందుకు, రాజీవ్ గాంధీ కృషి చేశారని భట్టి విక్రమార్క తెలిపారు. విద్యా రంగానికి రాజీవ్ గాంధీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇ చ్చిందని భట్టి విక్రమార్క తెలిపారు. 1986లో జాతీయ విద్యా విధానాన్ని తీసుకురావడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. సాంకేతికత, విద్య, ప్రజాస్వామ్యం, స్థానిక పాలన వంటి కీలక రంగాల్లో రాజీవ్ గాంధీ చేపట్టిన సంస్కర ణలు ఆధునిక భారతదేశ నిర్మాణంలో చిరస్థా యిగా నిలిచిపోయాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *