– 22ఏ అక్రమాలపై ‘సిట్’ బాణం
– ఆధార్ తరహాలో భూధార్ కార్డులు
– బేతుపల్లి సభలో మంత్రి పొంగులేటి ప్రకటన
సత్తుపల్లి / ఖమ్మం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 : తమ ప్రజా ప్రభుత్వంలో మేము ప్రవేశపెట్టిన ‘భూ భారతి’ చట్టం అమలే రాబోయే ఎన్నికల్లో మా ప్రజా ప్రభుత్వ పని తీరుకు రెఫరెండమ్.. చట్టం తెచ్చేనాడే ఈ మాట చెప్పాం.. ఈ రోజుకీ అదే మాట మీద నిలబడుతున్నాం. ప్రజ ల తీర్పు దగ్గరకు పోయినప్పుడు మీకు ఫలితా లు ఏంటో గతంలో చూపించాం.. భవిష్య త్తులోనూ అవే ఫలితాలు పునరావృతం అవుతా యని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం. సమా చార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. గురువారం సత్తుపల్లి మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలో కదా స్ట్రల్, నాన్-కడాస్ట్రల్ గ్రామాల భూ రీ సర్వేపై నిర్వహించిన రైతుల ముఖాముఖి, ప్రత్యేక అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి మంత్రి పాల్గొన్నారు. బేతుపల్లి రెవెన్యూ పరిధిలోని భేతుపల్లి, రామానగరం, తాళ్లమడ, గంగారం, నారాయణపురం, రామ గోవిందపురం, పాకాలగూడెం గ్రామాల పంచా యతీ ప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భూ రీ సర్వే ప్రక్రియ. భూ హక్కు ల నమోదుపై తమకు ఉన్న సందేహాలు, సమ స్యలను రైతులు మంత్రి దృష్టికి తీసుకువచ్చా రు.. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ “భూమి అనేది కేవలం మన్ను కాదు.. అది రైతన్నకు గుండెకాయ లాంటి ఎమోషనల్ బాండ్. గత ప్రభుత్వంలో ధరణి పేరుతో తీవ్ర అవకతవకలు జరిగాయి. సాగులో ఉన్న పేద రైతుకు పాస్ పుస్తకాలు రాకపోగా, సెంట్ భూమి లేని భోగస్ వ్యక్తులకు పదుల ఎకరాల రికార్డులు సృష్టించి బ్యాంకులు, రైతుబంధు సా మ్ము దోచుకున్నారు” అని మంత్రి ధ్వజమెత్తారు. నాగార్జునసాగర్ పైలట్ ప్రాజెక్టులో సర్వే చేయగా వేలాది ఎకరాల భోగస్ భూములు బయటపడ్డాయని, అందుకే ఇప్పుడు బేతుపల్లి తో పాటు రాష్ట్రవ్యాప్తంగా శాస్త్రీయ రోవర్ టెక్నా లజీతో సర్వే చేపడుతున్నామని వివరించారు.
ఆధార్ తరహాలో భూధార్ కార్డులు
ప్రతి జిల్లాలో తొలి విడతగా 70 గ్రామాలను ఎంపిక చేసి, రాబోయే ఏడాదిన్నర వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ భూములతో పాటు నివాస ప్రాంతాల (అబాదీ) భూములను కోఆ ర్డినేట్స్, మ్యాప్లతో సహా సర్వే చేస్తామన్నారు. ప్రతి రైతుకూ డిజిటల్ కోఆర్డినేషన్ మ్యాప్ కూడిన పక్కా హక్కుల టైటిల్ డీడ్ ఇస్తామని పేర్కొన్నారు. ప్రతిపక్షాల విమర్శలపై స్పందిస్తూ మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గతంలో చట్టం తెచ్చి మూడేళ్లు రూల్స్ చేయలేని వాళ్లు ఈరోజు మూడో నెలలోనే నిబంధనలు తెచ్చిన ప్రజా ప్రభుత్వాన్ని చూసి కారుకూతలు కూస్తున్నారు. .22ఏ ప్రొహిబిటెడ్ లిస్ట్ పేరుతో అమాయక ప్రజలను కవచంగా పెట్టుకుని, తెరచాటున వేలాది ఎకరాల అక్రమ ఆస్తులను రెగ్యులరైజ్ చేసుకోవాలని పగటి కలలు కంటున్నారు.. ఈ ప్రభుత్వంలో మీ పప్పులు ఉడకవు.. ప్రజల సొమ్ము తింటే వంటపట్టదు.. ఇందుకోసం ఇప్పటికే ‘సిట్’ వేశాం.. ముక్కు పిండి వసూలు చేస్తాం’ అని హెచ్చరించారు. కరీంనగర్, నిజామాబాద్ సహా ప్రతి జిల్లాకూ రెవెన్యూ మంత్రిగా స్వయంగా వెళ్లి రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి అక్రాస్ ది టేబుల్ సమస్యలను పరిష్కరిస్తానని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా భూ రీ సర్వే మొదటి దశలో ప్రతి జిల్లాలో 70 గ్రామాలను ఎంపిక చేసి చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. వచ్చే ఏడాదిన్నర కాలంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ భూములతోపాటు ఆబాది ఆస్తుల రీ సర్వేను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. వ్యవసాయ భూములకు వెళ్లే దారులు తప్పనిసరిగా ఉండేలా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పొలాలకు వెళ్లే దారులకు పట్టాలు ఇవ్వొద్దని, దారులను రైతుల భూముల్లో భాగంగా నమోదు చేయొద్దని స్పష్టం చేశారు. రైతులు తమ పొలాలకు సులభంగా చేరుకునేలా అవసరమైన అప్రోచ్ రోడ్లు, దారులను పరిరక్షించాలని సూచించారు. రీ సర్వే పూర్తయిన తర్వాత 30 రోజుల పాటు రైతుల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తామని మంత్రి తెలిపారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించిన తర్వాతే తుది హక్కులను నమోదు చేస్తామని చెప్పారు. మనుషులకు ఆధార్ కార్డు ఉన్నట్లుగా భూములకు కూడా అందజేస్తామని తెలిపారు. భేతుపల్లి రెవెన్యూ గ్రామంలో మొత్తం 12,047 ఎకరాల భూమి ఉండగా, సుమారు 2,026 ఎకరాల అసైన్డ్ భూములుగా ఉన్నాయని. ఇందులో సుమారు 980 ఎకరాలను పేదలకు అందించినట్లు చెప్పారు. ఇంకా సుమారు వెయ్యి ఎకరాల అసైన్డ్ భూముల్లో కొంతమంది రైతులు సాగు చేస్తున్నప్పటికీ వారికి పట్టాలు లేవని వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి, డీఎఫ్ఎ అనూజ్ అగర్వాల్, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాద వ్, ఏసీపీ వసుంధర, ఆర్ అండ్ బి ఎస్ఇ యుగంధర్ రావు, విద్యుత్ శాఖ ఎస్ఇ
శ్రీనివాసచారి పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





