- పార్టీకి నష్టం కలుగుతుంటే చూస్తూ ఊరుకోం
– హెచ్చరించిన పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత సీఎం రేవంత్‌రెడ్డిపై ఇటీవల చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ హై కమాండ్ సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలోనే సుష్మిత వ్యాఖ్యల వీడియోను కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ పరిశీలించింది. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. పార్టీకి నష్టం కలుగుతుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. సుష్మిత లైన్ దాటి ఆరోపణలు చేశారని అన్నారు. అనిరుధ్, కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి హద్దు మీరలేదని చెప్పారు. పార్టీ లైన్ ఎవరు దాటినా చర్యలు తప్పవని మహేశ్‌గౌడ్ పేర్కొన్నారు. కొండా సురేఖ విషయంలో మరోసారి సమావేశం నిర్వహిస్తామని క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి పేర్కొన్నారు. కొండా సురేఖ వివరణ చదివామని తెలిపారు. సుష్మిత మాటల వీడియోలను చూశామని చెప్పారు. ముఖ్యమంత్రిపై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. మంత్రి సురేఖ వివరణపై మరోసారి సమావేశం కావాలని భావించామన్నారు. క్రమశిక్షణ కమిటీకి మరి కొందరు ఎమ్మెల్యేలు మరిన్ని వివరాలు ఇస్తామన్నారని చెప్పారు. అలాగే, చిన్నారెడ్డి వివరణ లేఖ చదివామని, ఆయన వ్యాఖ్యల వీడియోలు చూశామని మల్లు రవి తెలిపారు. చిన్నారెడ్డి విషయంలో ఎమ్మెల్యే మేఘారెడ్డితో మాట్లాడతామన్నారు. చిన్నారెడ్డి వ్యాఖ్యలకు, మేఘారెడ్డి ఫిర్యాదుకు చాలా అంతరం ఉందని చెప్పారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మాట్లాడిన అంశాలు తనకు తెలుసని, కానీ పద్ధతి ప్రకారం విచారణ ఉంటుందని రవి తెలిపారు. ఆయా వ్యక్తులపై తమకు ఎలాంటి అభిప్రాయం ఉండదని చెప్పారు. పార్టీనే తమ మొదటి ప్రాధాన్యం అని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ ఇన్‌చార్జ్ కంది శ్రీనివాస్ వివరణ లేఖ తమకు అందిందని మల్లు రవి తెలిపారు. తన వ్యాఖ్యలపై కంది శ్రీనివాస్ విచారం వ్యక్తం చేశారని అన్నారు. ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడిని ఫోన్‌లో సంప్రదించే ప్రయత్నం చేశామని చెప్పారు. కంది శ్రీనివాస్ రెడ్డి అంశాన్ని సైతం మరోసారి కూర్చొని మాట్లాడతామని మల్లు రవి పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





