– ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కాంగ్రెస్ రాష్ట్ర క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసులపై ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి స్పందించారు. తానేం తప్పుగా మాట్లాడలేదని లేఖలో పేర్కొన్నారు. ‘ఏ రోజూ నేను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఎవరిపైనా అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. రెండున్నరేళ్లుగా కార్యకర్తల ఆవేదనను వ్యక్తంచేశా. స్థానిక ఎమ్మెల్యే వ్యవహారం ఒంటెద్దుపోకడలా ఉంది. నేతలు, కార్యకర్తలు పడుతున్న ఆవేదననే తెలిపా. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాలనే ఉద్దేశం నాకు లేదు. పార్టీకి నష్టం కలిగించేవారిని ప్రశ్నించడమే నా ఉద్దేశం. నాపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం. వాటిపై విచారణ జరిపి న్యాయం చేయాలి‘ అని లేఖలో పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు