– టీచింగ్ హాస్పిటళ్లలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ
– వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ఆయా కమ్యూనిటీ(సీహెచ్‌సీ), ఏరియా, జిల్లా హాస్పిటల్‌లను పూర్తిస్థాయి వైద్య కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. జిల్లా, ఏరియా హాస్పిటల్‌ల్లోనూ మేజర్ సర్జరీలు అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. సచివాలయంలో మీడియాతో మంత్రి దామోదర్ శనివారం మాట్లాడారు. టీచింగ్ హాస్పిటళ్లలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. జిల్లా, ఏరియా హాస్పిటల్‌లు, 1,616 మంది స్పెషలిస్ట్ డాక్టర్లను నియమిస్తామని చెప్పారు. చిన్న సమస్యలకే పెద్ద హాస్పిటల్‌లకు రిఫర్ చేయొద్దని ఆదేశించారు.అవసరమైతేనే పేషెంట్లను పై స్థాయి హాస్పిటల్‌లకు రిఫర్ చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచించారు. అత్యవసర రిఫరల్‌కు ముందు సంబంధిత హాస్పిటల్‌కి సమాచారం ఇవ్వాలని సలహా ఇచ్చారు. అవసరమున్న హాస్పిటల్‌ల్లో కొత్త సీటీ స్కాన్లు, వైద్య పరికరాలను అందుబాటులో ఉంచుతామని అన్నారు. పరికరాల ప్రతిపాదనలకు రోగుల సంఖ్య, అవసరంపై జస్టిఫికేషన్ తప్పనిసరని చెప్పారు. డీసీహెచ్‌ఎస్‌లు వారానికి ఒకరోజు ఆకస్మిక తనిఖీలు చేయాలని మంత్రి ఆదేశించారు. డీసీహెచ్‌ఎస్‌లు విధులకు గైర్హాజరు, విధుల నుంచి ముందే వెళ్లిపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆయా హాస్పిటల్‌ల్లో సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించాలని అన్నారు. పరిశుభ్రత, తాగునీరు, బయోమెడికల్ వేస్ట్‌పై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ప్రతి నెలా డీసీహెచ్‌ఎస్‌ల వర్క్ రిపోర్ట్ ప్రభుత్వానికి సమర్పించాలని మంత్రి దామోదర్ ఆదేశించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు