– అసెంబ్లీ, ఎరవ్రెల్లి ఫాంహౌస్ వద్ద ఘటనలపై..
– డీజీపీకి టీజీహెచఆర్‌సీ ఆదేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : అసెంబ్లీ వద్ద జరిగిన రెండు సంఘటనలకు సంబంధించి దాఖలైన ఫిర్యాదులపై నివేదికలు సమర్పించాలని చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ నేతృత్వంలోని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (టీజీహెచఆర్‌సీ) డీజీపీకి ఉత్తర్వులు జారీ చేసింది. బీఆరఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ దళిత సామాజిక వర్గానికి చెందిన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను మీడియా సమక్షంలో అసభ్య పదజాలంతో దూషించారని జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్, ఇతరులు ఆరోపించారు. అలాగే, దళితులు మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు చెందిన ఎర్రవెల్ల్లి ఫామ్‌హౌస్ ఎదుట నిరసన నిర్వహించిన సమయంలో బీఆరఎస్ నాయకురాలిగా పేర్కొన్న పావని గౌడ్, ఇతరులు పసుపు నీరు, పాలు చల్లి ఆ ప్రాంతాన్ని ‘శుద్ధి’ చేసినట్లు, దళిత నిరసనకారులను అవమానకర పదజాలంతో దూషించినట్లు ఆరోపించారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారులు కోరారు. అలాగే శాసనసభ ప్రాంగణంలో జరిగిన నిరసన కార్యక్రమంలో కొంతమంది బీఆరఎస్ ఎమ్మెల్యేలు నల్ల టీ షర్టులు తొలగించి మహిళా పోలీసు సిబ్బంది సమక్షంలో అర్ధనగ్నంగా నిలబడినట్లు ఇందిరా శోభన్ ఫిర్యాదు చేశారు. ఈ ప్రవర్తన మహిళా పోలీసు సిబ్బందికి ఇబ్బంది, మానసిక వేదన, అవమానాన్ని కలిగించడంతోపాటు వారి గౌరవం, భద్రతపై ప్రభావం చూపిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీసీటీవీ, ఇతర వీడియో దృశ్యాలను పరిశీలించి బాధ్యులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రికార్డులో ఉన్న అంశాలను పరిశీలించిన అనంతరం రెండు కేసుల్లోనూ డీజీపీ నుంచి నివేదికలు కోరుతూ చైర్పర్సన్ ఆదేశాలు జారీ చేశారు. రెండు కేసులను వచ్చే నెల 9కు వాయిదా వేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు


