హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్ర, శనివారాలు రెండు రోజులపాటు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు మద్దూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నిర్మాణంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను తనిఖీ చేయనున్నారు. మధ్యాహ్నం 3.20 గంటలకు దౌల్తాబాద్ మండలం గోకఫసల్వాడ్‌లో నిర్మాణంలో ఉన్న బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను, సాయంత్రం 4 గంటలకు దౌల్తాబాద్ పట్టణంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల పనులను పరిశీలిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించనున్న సీఎం అక్కడే నియోజకవర్గ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించనన్నారు. సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రోడ్డు మార్గాన కొడంగల్‌లోని నివాసానికి చేరుకుని అక్కడే బస చేయనున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



