రేపు కర్ణాటకకు సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్

తుంగభద్ర జ‌లాల‌పై ఏపీ, తెలంగాణ సీఎంల కీలక భేటీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితోపాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉ త్తమ్ కుమార్ రెడ్డి కర్ణాటకలో గురువారం పర్యటించనున్నారు. హోస్పేట వద్ద ఉన్న ప్రముఖ అంతర్రాష్ట్ర ప్రాజెక్టు తుంగభద్ర జలాశయానికి నూతనంగా ఏర్పాటు చేసిన క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి వారు హాజరుకాబోతున్నారు. కర్ణాటక ప్రభుత్వ అధికారిక ఆహ్వానం మేరకు ఈ పర్యటనకు వెళ్తున్నట్లు సమాచారం. గతంలో తుంగభద్ర డ్యామ్ గేట్లు కొట్టుకుపోయిన చేదు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని కర్ణాటక ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా యుద్ధప్రాతిపదికన కొత్త గేట్ల ఏర్పాటు పనులను చేపట్టింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనులు విజయవంతంగా పూర్తి కావడంతో రేపు ఈ నూతన గేట్ల భారీ ప్రారంభోత్సవ వేడుకను నిర్వ హించనున్నారు.

అంతర్రాష్ట్ర జల సంబంధాల బలోపేతం, ఆర్డీఎస్ పై చర్చ?

తుంగభద్ర బోర్డు పరిధిలో తెలంగాణ కూడా ఒక ముఖ్య భాగస్వామిగా ఉంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అంతర్రాష్ట్ర జల సంబంధాల బలోపేతానికి ఎంతగానో దోహదపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రానికి కీలకమైన రాజోలిబండ డైవర్షన్ స్కీమ్(ఆర్డీఎస్) వంటి పెండింగ్ ప్రాజెక్టుల సమస్యల పరిష్కారానికి, నీటి వాటా వివాదాలు సద్దుమణిగేందుకు ఈ వేదిక ఒక మంచి అవకాశంగా మారే వీలుంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *