నవంబర్‌ ఎన్నికలు, భారత మార్కెట్‌ను శాసించే పెద్దన్న కుట్రలు..!!

“భారత మార్కెట్‌ను, రాజకీయాలను శాసించే పెద్దన్న వ్యూహం కూడా ఉంది. నవంబర్ 2026 మొదటి వారంలో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అధికారంలోకి వస్తే యుద్దాలు ముగిస్తానన్న ట్రంప్‌ ,అనేక దేశాల్లో మరిన్ని యుద్దాలను సృష్టించి ప్రపంచవ్యాప్తంగా నరమేధ యాగం చేస్తున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగానే కాదు అమెరికాలో కూడా ట్రంప్‌పై వ్యతిరేకత పెరుగుతుంది. నవంబర్ లో జరిగే మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ గట్టేక్కాలంటే భారతీయుల వోట్లు చాలా కీలకం కానుంది. ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే భారత్‌పై ట్రంప్‌ ప్రకనలుంటున్నాయి..”

ప్రపంచంలోని రిచ్‌ కంట్రీస్‌, ఆర్ధికంగా అభివృద్ది చెంది ఇతర దేశాలను రాజకీయంగా ఆర్థికంగా శాసిస్తున్న జీ7 దేశాల వార్షిక సదస్సు  జూన్ 15 నుండి 17 వరకులో ఫ్రాన్స్‌లో  జరిగింది. గ్రూప్‌ ఆఫ్ సెవన్‌ దేశాల్లో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యూఎస్‌ లు సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈ దేశాలు అంతర్జాతీయ మార్కెట్లను, రాజకీయాలను ప్రభావితం చేస్తాయి. భారత్ జీ7లో సభ్యదేశం కాదు, కానీ సౌత్‌ ఆసియాలో బలమైన రాజకీయార్థిక, మార్కెట్‌ పరంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ బలమైన వ్యవస్థగా ఎదుగుతూ, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కావడంతో ప్రతి సంవత్సరం జీ7 సదస్సుకు భారత్‌ ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరవుతోంది.
జీ7 దేశాలు ఆర్థికంగా అభివృద్ది చెందిన దేశాలు. మార్కెట్‌ విస్తరణ కోసం ఏర్పడిన పోటీ నేపథ్యంలో పరస్పరం సహకరించుకుంటూ ప్రపంచ మార్కెట్‌ను తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు ఏర్పడిన సిండికేట్‌ సమూహమే జీ7 గ్రూప్. ప్రతి ఏడాది తమ మార్కెట్ విస్తరణ కోసం సదస్సును ఏర్పాటు చేసుకుంటాయి. ఆ ఏడాదికి మార్కెట్‌ విస్తరణ కోసం నిర్ణయాలు తీసుకుని తీర్మానాలు చేస్తుంది.అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలపై తమ నిర్ణయాలను బలవంతంగా రుద్దుతాయి.అందులో భాగంగానే  తమ మార్కెట్‌ విస్తరణ కోసం విస్తారమైన మార్కెట్‌ అవకాశాలున్న భారత్‌, ఈయూ వంటి దేశాలను ప్రత్యేకంగా ఆహ్వానిస్తాయి.
మనకు తెలియకుండా మన మార్కెట్‌లకు మన సమక్షంలోనే  జీ7 దేశాలు మరణశాసనం రాస్తాయి..తాజాగా ప్రతి ఏడాది జీ7 సదస్సులో పాల్గొన్నట్లే ఈ సారి కూడా ప్రధాని మోదీ  సదస్సుకు హాజరయ్యారు. భారత్‌ లో మార్కెట్‌ విస్తరణావకాశాలు, ప్రభుత్వం జీ7 ఇచ్చే రాయితీలు, మినహాయింపుల గురించి జీ7 దేశాలకు ప్రధాని  వివరించారు.విస్తారమైన  భారత్ మార్కెట్ ను రిచ్ కంట్రీస్ కు ధారాదత్తం చేశారు.
.జీ 7 దేశాలు పక్క కమర్షియల్‌ దేశాలు..వ్యాపార విస్తరణ, మార్కెట్ల అన్వేషణ కోసం ఏమైనా చేస్తాయి. అవసరమైతే దేశాల మధ్య కృత్రిమ యుద్దాలు సృష్టిస్తాయి.డీప్‌ స్టేట్‌ కుట్రలతో ప్రభుత్వాలను పడగొట్టుతాయి..దేశాల మధ్యే కాదు ప్రజల మధ్య కూడా విభేదాలు, వైషమ్యాలను సృష్టించి ప్రభుత్వాలను తమ గుప్పిట్లో పెట్టుకుంటాయి. అభివృద్ది చెందిన దేశాలే  కాదు పేద, అభివృద్ది చెందుతోన్న దేశాల మధ్య యుద్దాలు సృష్టించేస్తాయి. వాటి లక్ష్యం నెరవేరగానే చర్చలు ఒప్పందాల ముసుగులో అవే ఆపుతాయి. కానీ ప్రత్యేక్ష యుద్దాల్లో అభివృద్దిన దేశాలు పాల్గొనవు, యుద్దం పాల్గొంటే జరిగే నష్టంపై జీ7 దేశాలకు స్వయంగా అనుభవం ఉంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న యుద్దాలన్నీ జీ7 దేశాల కనుసన్నల్లోనే, వాటి పరోక్షం ప్రోత్సాహంతోనే జరుగుతున్నాయి.
ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ఇరాన్‌-ఇజ్రాయెల్ యుద్దం జరుగుతున్న కీలక సమయంలో జీ 7 దేశాల సదస్సు జరిగింది. ఇరాన్‌ వార్‌ వల్ల ఎక్కువ నష్టపోయేది సౌత్‌ ఆసియా కంట్రీసే..అందుకే గతంలో కంటే ఈసారి ప్రధాని మోదీకి జీ7 దేశాలు అందులో ట్రంప్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు..ఇది కేవలం కృత్రిమ ప్రాధాన్యతే అన్నది ఓపెన్‌ సీక్రీట్. ఇరాన్‌ ఇజ్రాయెల్‌ వార్‌, రష్యా ఉక్రెయిన్‌ యుద్దం జీ 7 దేశాలను సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి..అమెరికా ఆర్థికా సంక్షోభం అంచులో ఉంది.
ఇప్పుడు జీ7 దేశాలకు ముఖ్యంగా అమెరికాకు భారత్‌ మార్కెట్‌ చాలా అసవరం. ఇండియన్‌ మార్కెట్‌ లేకపోతే యూఎస్‌ ఆర్థికంగా దివాలా  తీస్తుంది. ఇప్పటికే యుద్దోన్మాది ట్రంప్ వల్ల అమెరికన్లు అనేక కష్టాలు నష్టాలు పడుతున్నారు. గ్లోబల్‌ ఇన్వేష్టర్లకు ముఖ్యంగా అమెరికా కంపెనీల పెట్టుబడులకు భారత్‌ ఒక్కటే లాభదాయకమైన దేశం. అందుకే ఫ్రాన్స్‌ పర్యటనలో ప్రధాని మోదీకి ట్రంప్‌ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు అస్కార్‌ స్థాయిలో నటించారు. ఇది అవకాశవాద ప్రాధాన్యత తప్ప ప్రేమతో చూపించిన అభిమానం కాదు.
భారత్‌ అంటేనే ట్రంప్‌ ఒంటికాలిపై లేస్తాడు. ఇండియాపై టారిఫ్‌లు, కొత్త పన్నులు, వీసా నిబంధనాలు కఠినతరం చేస్తూ భారతీయులను వేధిస్తున్నారు.ఏకంగా ఇండియన్స్‌ కాళ్లు చేతులు గొలుసులతో కట్టేసి ఖైదీలను తరలించినట్లు యుద్ద విమానం భారత్‌కు తరలించారు. భారతీయ ఎగుమతులపై భారీగా పన్నులు వేస్తూ దిగుమతులపై పెద్ద మొత్తంలో రాయితీలు ఇచ్చేలా భారత్‌పై రాజకీయార్థిక ఒత్తిడి పెట్టారు.
భారత్ చుట్టు సరిహద్దు దేశాల్లో భారత్ వ్యతిరేక ట్రంప్‌ అనుకూల ప్రభుత్వాలను ఏర్పాటు చేసి శత్రువులతో ఎప్పుడూ ప్రమాదం ఉండేలా చేశారు.పాక్‌, అప్ఘన్‌, బంగ్లా, మయాన్మార్‌, శ్రీలంక, చైనా భారత్‌ చుట్టు శత్రువులను అమెరికా పాముకు పాలుపోసి పెంచుతుంది. అవకాశం చూసి భారత్‌ను కాటేసేందుకు పక్క పగడ్బందిగా పెద్దన్న అడుగులు వేస్తున్నారు.
ఇప్పుడు ఉన్నపళంగా ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 దేశాల సదస్సులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌ భజన చేశారు.ప్రధాని మోదీని భుజాలపై మోస్తూ ప్రశంసించారు. ఊరక రారు మహానుభావులు అన్నట్లు అగ్రరాజ్యం ఎప్పుడు ఏ దేశాన్ని ఊరికే ఆకాశానికి ఎత్తదు, ఏదో బలమైన కారణం, ఆయా దేశాల నుంచి ప్రత్యేక్ష, పరోక్ష లబ్ది కోసం కుట్రలు ఉంటే తప్ప ఇతర దేశాలపై అతి ప్రేమను ప్రదర్శించదు.
తాజాగా జీ-7 సదస్సులో భారత్‌పై ట్రంప్ ప్రశంసలు కూడా భారత్‌కు రాబోయే ప్రమాదానికి ఒక సంకేతమే.. ఆకాశానికి ఎత్తడమంటే భవిష్యత్‌ లో వచ్చే ప్రమాదానికి హెచ్చరికలాంటిదే. భారత విదేశంగా విధానాలను ట్రంప్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు.ఎందుకంటే అవి అమెరికా ప్రయోజనాలకు ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి భారత అలీనోద్యమాన్ని తప్పుబట్టుతుంటారు. ఉక్రెయిన్‌ వార్‌తో రష్యా నుంచి ఆయిల్‌ కోనుగులపై ఆంక్షలు విధించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపకపోతే భారీ టారీఫ్‌లతో ఇండియన్‌ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తామని బాహాటంగానే ట్రంప్ హెచ్చరించారు.
 జీ7 సదస్సులో అమెరికా అధ్యక్షుడు మరో కీలక కామెంట్ చేశారు. మోదీ  ప్రధానిగా ఉన్నంత కాలం భారత్‌తో మంచి సంబంధాలంటూ ప్రకటించారు.భారత్‌పై ఎవరు కన్నేత్తి చూసిన ఊరుకునేది లేదంటూ ట్రంప్‌ ప్రకటించారు.ఈ రెండు కీలక ప్రకటనల వెనుక భవిష్యత్‌లో భారత్‌ ఆర్థిక రాజకీయాల్లో అమెరికా జోక్యం మరింత పెరుగుతుందని ట్రంప్‌ పరోక్షంగా చెప్పకనే చెప్పారు.
.ట్రంప్‌ సడెన్ టూర్న్‌ వెనుక వ్యూహం ఏంటీ అన్న చర్చ దేశంలో మొదలైంది..భారత్‌పై ట్రంప్‌ది ప్రేమానా..? మోదీపై అభిమానమా..?.భారత్‌ నుంచి పెద్దన్న ఏం ఆశించి అలాంటి ప్రకటనలు చేయడం అందులోనూ ఇరాన్‌ యుద్దం ముగింపు దశలో ప్రకటించడం దేశ ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది..ట్రంప్ మాటలకు చేతలకు అస్సలు సంబంధం ఉండదు.గడియకో నిర్ణయం,గంటకో ప్రకటన చేసే ట్రంప్ భారత్‌పై ప్రశంసలు కురిపించడం వెనుక ఉన్న ప్రమాదం ఏంటోనని భారతీయులు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికే అనేక దేశాల్లో యుద్దాలను మొదలుపెట్టి ఆ యుద్దాలతో ఆయుధ వ్యాపారం చేసుకొవచ్చని అలోచించి అగ్ర రాజ్యం భంగపడింది. ఆ నష్టాల నుంచి యుద్దాల నుంచి బటయపడేందుకు అమెరికా నానా తంటాలు పడుతుంది.ఇప్పటికే యూఎస్‌ ఆర్థిక వ్యవస్థ సంక్షోభం అంచుల్లో ఉంది. ట్రంప్‌ అమెరికా ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.ప్రజలే కాదు వ్యాపారులు కూడా ఆగ్రహంతో ఉన్నారు. అనేక యుద్దాలతో కుదేలైన అమెరికా ఆర్థిక వ్యవస్థ సంక్షోభం నుంచి బయటపడేందుకు భారత్‌ మార్కెట్‌ను కాపాడుకోవడం తప్ప మరో మార్గం లేదు. భారత్‌ తప్ప మరో మార్కెట్‌ అవకాశాలు అమెరికాకు లేవు. అందుకే భారత మార్కెట్‌పై గుత్తాధిపత్యం అమెరికాదే అన్నట్లు భారత్‌పై కన్నెత్తి చూస్తే ఊరుకోమంటూ ట్రంప్‌ ప్రకటనలు చేస్తున్నారు. భారత్ చిరకాల మిత్రుడు, మోదీ  అప్తమిత్రుడంటూ భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టుతామంటూ ట్రంప్ ఒకవైపు హెచ్చరికలు మరోవైపు వ్యాపార విస్తరణ ప్రకటనలు చేస్తున్నారు.
అంతేకాదు జీ7 సదస్సులో ప్రధాని మోదీ , భారత్‌పై లేని ప్రేమను, అభిమానాన్ని కురిపించడం వెనుక ట్రంప్ మరో కోణం కూడా ఉంది. భారత మార్కెట్‌ను, రాజకీయాలను శాసించే పెద్దన్న వ్యూహం కూడా ఉంది. నవంబర్ 2026 మొదటి వారంలో అమెరికాలో  మధ్యంతర ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అధికారంలోకి వస్తే యుద్దాలు ముగిస్తానన్న ట్రంప్‌ ,అనేక దేశాల్లో మరిన్ని యుద్దాలను సృష్టించి ప్రపంచవ్యాప్తంగా నరమేధ యాగం చేస్తున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగానే కాదు అమెరికాలో కూడా ట్రంప్‌పై వ్యతిరేకత పెరుగుతుంది. నవంబర్ లో జరిగే మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ గట్టేక్కాలంటే భారతీయుల వోట్లు చాలా కీలకం కానుంది. ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే భారత్‌పై  ట్రంప్‌ ప్రకనలుంటున్నాయి. అంతేకానీ, భారత్‌పై ప్రేమతోనే భారతీయుల మీద ప్రేమతోనో కాదు.ఒకటి మధ్యంతర ఎన్నికల నుంచి బయటపడేందుకు మరోకటి భారత్‌ మార్కెట్‌ కోసమే పెద్దన్న మోదీ  భజనంతా.
భారత్‌పై కన్నేత్తి చూసే మిసైళ్లవర్షం కురిపిస్తామంటూ పరోక్షంగా భారత్‌ దాయాది సరిహద్దు దేశాలను హెచ్చరిస్తూ యుద్దం చేసేలా రెచ్చగొట్టే ప్రయత్నం ట్రంప్ చేస్తున్నారు. భారత్‌పై కన్నేత్తి చూస్తే అమెరికా సహయం అవసరం లేదు, భారత్‌కు ప్రత్యార్థులను నిలువరించే శక్తి ఉంది. కానీ పరోక్షంగా దేశాలను యుద్దాల్లోకి లాగేందుకు ట్రంప్ వ్యూహత్మక ప్రటనలు చేస్తున్నారు.ఇరాన్‌ ఇజ్రాయెల్‌ శాంతి ఒప్పందంలో పాక్‌ను క్రియాశీలంగా మార్చి ఇప్పుడు భారత్‌పై కన్నేత్తి చూస్తే ఊరుకోమంటే ట్రంప్ ఉద్దేశ్యం ఏంటీ.?..త్వరలో మళ్లీ భారత్‌ సరిహద్దు దేశాల్లో ఉద్రిక్తతలకు పురిగొల్పే ప్రయత్నమే కదా..మొన్న చైనా పర్యటనలో తైవాన్‌తో అగ్గి రాజేసిన ట్రంప్‌. చైనాను కంట్రోల్‌ చేసేందుకు యుద్ద సన్నద్ధాలు మొదలుపెట్టారు. చైనా గట్టిగా కౌంటర్‌ ఇవ్వడంతో పెద్దన్న తోక ముడిచాడు.
ఇప్పుడు భారత్‌పై కన్నెత్తి చూసే ధైర్యం ఒక్క పాక్‌కు మాత్రమే ఉంది..మరి పాక్‌తో వైరం వస్తే ట్రంప్ భారత్‌ వైపా, పాక్‌ వైపు ఉంటారా.?.పాక్‌ తనకు యుద్దాలు సృష్టించే, ఉగ్రవాదులను తయారు చేసే చెలమలాంటింది. పాక్‌ లేకపోతే అమెరికా ఆయుధ వ్యాపారం ఉండడు.ఖచ్చితంగా పాక్‌ వైపే ఉంటారు.అంతేకాదు ఇరాన్‌ ఇజ్రాయెల్ మధ్య చర్చలో పాక్‌ కీలక పాత్ర పోషించింది..పాక్ సమక్షంలోనే చర్చలు జరిగాయి అలాంటప్పుడు ట్రంప్‌ పాక్‌ వైపు కాకుండా భారత్ వైపు నిలబడే సాహసం చేస్తారా. అలా నిలబడితే ఇరాన్ ఇజ్రాయెల్‌ శాంతి అగ్రిమెంట్ నిలబడుతుందా.
అసలు భారత్‌పై ట్రంప్‌కు ఎందుకుకంతా ప్రేమ పుట్టుకోవచ్చింది.?. ఈ కృత్రిమ భజన వెనుక ట్రంప్ మరో వ్యూహం కూడా ఉంది.ఇరాన్‌ ఇజ్రాయెల్‌ వార్‌లో ఓనమ్‌లో భారతీయ నౌకపై అమెరికా డ్రోన్ దాడి చేసింది.ఈ దాడిలో ముగ్గురు భారతీయులు మృతి చెందారు.ఇది దౌత్యపరంగా అంతర్జాతీయంగా తీవ్రవైన అంశం.అమెరికా భారత్‌కు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది..అంతర్జాతీయ దేశాల మధ్య దౌత్య ఒప్పందాలను దిక్కరించి భారత్‌ నౌకపైదాడి భారతీయుల మృతికి కారణమైన యూఎస్‌ను ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టాల్సిన ఉండేది.
కానీ అమెరికాను అంతర్జాతీయంగా విమర్శించడంలో భారత విదేశాంగ శాఖ విఫలమైంది.మోదీ  సర్కార్‌ తూతూ మంత్రంగా ఖండనలు జారీ చేసింది.ఈ విషయంపై అంతర్జాతీయంగా అమెరికాను కార్నర్‌ చేయడంలో వైఫల్యం చేందింది. ఇంత తీవ్రమైన ఇష్యూ నుంచి భారతీయులు, అంతర్జాతీయ సమాజం దృష్టి మరల్చేందుకు భారత్‌పై ట్రంప్‌ కృత్రిమ ప్రేమను వలకబోస్తున్నారు. భారతీయులపై లేని అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు.  అంతేకాదు నవంబర్‌లో మధ్యంతర ఎన్నికలతో పాటు త్వరలో  భారత్‌ యూఎస్‌ మధ్య జరిగే ట్రేడ్ డీల్‌ కూడా అమెరికాకు, ట్రంప్‌కు చాలా ముఖ్యం. ఈ డీల్‌ ఆగిపోతే అమెరికాకు భారీ నష్టం జరుగుతుంది. ఒప్పందం స్మూత్‌గా జరిగేందుకు ట్రంప్‌ మోదీ  భజన చేస్తున్నారు..అందుకే భారత్‌పై ట్రంప్‌  లేని ప్రేమ ప్రదర్శిస్తున్నారు.
-తోటకూర రమేష్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *