స్పీకర్‌కు సీఎం రేవంత్ పరామర్శ

– నిన్న అసెంబ్లీ ఎదుట జరిగిన పరిణామాల నేపథ్యంలో ..

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8 : బీఆరఎస్ నాయకులు ఏకంగా స్పీకర్‌ని అసభ్యకర పదజాలంతో దూషించి మొత్తం తెలంగాణ సమాజాన్ని అవమానపరిచేలా వ్యవహరించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎదుట జరిగిన ఈ దురదృష్టకర పరిణామాలపై పత్రికలు, టీవీలు, అన్ని మీడియాలు ప్రముఖంగా ప్రచురించాయన్నారు. తనను వ్యక్తిగతంగా దూషించటంతో స్సీకర్ కంట తడి పెట్టుకున్న దృశ్యాలు చూసి ముఖ్యమంత్రి ఆవేదన చెందారు. మంగళవారం అసెంబ్లీకి రాగానే స్పీకర్ ఛాంబర్‌కు వెళ్లి ఆయనను సీఎం పరామర్శించారు. స్పీకర్‌ను ఓదార్చారు. నిన్న జరిగిన సంఘటనలపై విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, బాధ్యులపై తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటుందని స్పీకర్‌కు తెలియజేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *