సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి

-కేటీఆర్ డిమాండ్
– సభలో చర్చను దారిమళ్లించేందుకే కాంగ్రెస్ చిల్లర డ్రామాలు

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 8 : శాసనసభలో తమ పార్టీ మహిళా ప్రజాప్రతినిధికి జరిగిన అవమానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కచ్చితంగా క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఒక ప్ర‌క‌ట‌న‌లో డిమాండ్ చేశారు. శాసనసభ వేదికగా ప్రతిపక్షాన్ని ఎదుర్కొలేక కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర డ్రామాలకు తెరలేపిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పరిపాలనా వైఫల్యాలు, ‘420’ హామీలు సహా అన్ని ప్రజా సమస్యలపై శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని, ప్రతీ అంశంపైనా స్పష్టమైన సమాధానాలు రాబడతామని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలు సభలో చర్చకు రాకుండా తప్పించుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి చిల్లర వేషాలు వేస్తోందని, ఈ పరిణామాలన్నింటినీ ప్రజలంద‌రూ నిశితంగా గమనిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  బెదిరింపులకు భయపడేవారు బీఆర్‌ఎస్‌లో ఎవరూ లేరని కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై జరుగుతున్న దాడి, అరెస్టుల అంశంపై శాసనమండలిలో ఖచ్చితంగా చర్చ జరగాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ నాయకురాళ్లపై జరిగిన దాడికి, బనాయించిన కేసులకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనని తేల్చిచెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *