– ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళిక లేకుంటే ఎలా?
– కేంద్రాన్ని తిడుతూ సమస్యలను దాటవేస్తారా..
– సీఎం రేవంత్‌పై మండిపడ్డ ఎంపీ అర్వింద్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5 : పాలన చేతకాకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విÖడియా సమావేశంలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై ఆరోపణలు చేస్తూ బీజేపీ నేతల ఇళ్ల ముందు ధాన్యం పోస్తామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి అయిన వ్యక్తి రైతుల సమస్యలను పరిష్కరించాల్సిందిపోయి రాజకీయాలు చేయడం తగదని అర్వింద్ హితవు పలికారు. ఇది సీఎంగా ఆయన వైఫల్యానికి నిదర్శనమన్నారు. వరి కోతలు ప్రారంభమయ్యే ముందే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉండగా వాటి ఏర్పాటులో విఫలమై కేంద్రంపై నెపం మోపడం సరికాదని అన్నారు. రాష్ట్రంలో ఎంత పంట ఉత్పత్తి అవుతుందో ముందుగానే అంచనా వేసి ప్రణాళికలు రూపొందించకుండా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని అర్వింద్ వ్యాఖ్యానించారు. ఇసుక, మొరం అక్రమ రవాణా కోసం ట్రాక్టర్లు, లారీలు అందుబాటులో ఉంటే రైతుల ధాన్యాన్ని తరలించేందుకు మాత్రం కొరత వస్తుందా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐకి లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతూ నగర సమస్యలను పరిష్కరించకుండా కొత్త నగరాల గురించి సీఎం మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. నిరుద్యోగ భృతి, గ్రావిÖణ అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ వంటి అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. తెలంగాణ ప్రయోజనాలకు అనుకూలంగా ముఖ్యమంత్రి ఇప్పటివరకు కేంద్రం ముందు బలమైన వాదన వినిపించలేదని అరవింద్ విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హావిÖల అమలుపై సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నాయకత్వాన్ని, పాలకులను అర్వింద్ డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




