ఉద్యమంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం

– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో అదృశ్యమైన మండల రాజు కుటుంబానికి మానవతా దృక్పథంతో రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. ఉద్యమంలో రాజు చురుకుగా పాల్గొన్నారని, ఈ క్రమంలో ఆయన అరెస్టయి చర్లపల్లి కేంద్ర కారాగారంలో నిర్బంధం తర్వాత అదృశ్యమయ్యాడని ఎమ్మెల్యే తన లేఖలో పేర్కొన్నారు. రాజు తన వృద్ధ తల్లిదండ్రులకు ఏకైక కుమారుడని, ప్రస్తుతం వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రోజువారీ జీవనోపాధికి ఎలాంటి ఆధారం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తెలంగాణ అమరవీరుల కోటా కింద మానవతా దృక్పథంతో ఆయన తల్లిదండ్రులకు ఆర్థిక సాయం అందించాలన్న ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి గొర్లవీడు గ్రామానికి చెందిన రాజు తండ్రి మండల సమ్మి రెడ్డికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో అంకితభావంతో సేవలందించిన దివంగత లింగాల కేదారి, ఆయన భార్య దివంగత పుష్పలత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. హనుమకొండలోని శాంతినగర్ పోస్టల్ కాలనీకి చెందిన కేదారి 2026 సెప్టెంబర్ 9న, ఆయన భార్య పుష్పలత 2026 సెప్టెంబర్ 10న విషాదకర సంఘటనలో మృతిచెందారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వారి సీఎంఆర్ఎఫ్ నుంచి సీఎం ఓఎస్డీ రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేశారు. మంజూరైన ఆర్థిక సాయాన్ని అర్హులైన చట్టబద్ధ వారసులు, కుటుంబ సభ్యులకు అందించేలా చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్‌ను ఆదేశించారు.

——————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *