సివిల్ వర్కులు వేగవంతంగా పూర్తిచేయాలి

– సనత్ నగర్ టిమ్స్ పరిశీలించిన మంత్రి దామోదర్

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 28 : అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన సనత్‌నగర్ టిమ్స్ హాస్పిటల్‌లో చేపట్టిన సివిల్ వర్క్‌లను శరవేగంగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. హాస్పిటల్‌లో ఆధునిక పరికరాలు, వైద్య సదుపాయాలు, ఇన్‌ఫ్రాÛ, ల్యాబొరేటరీ, బ్లడ్ బ్యాంకులను గురువారం పరిశీలించారు. ఆస్పత్రి ప్రాంగణంలో డాక్టర్లకు విడివిడిగా బాయ్స్, గర్ల్స్ హాస్టల్ బ్లాక్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఔట్ పేషంట్, ఇన్ పేషంట్‌ల అవసరమైన టాయిలెట్ బ్లాక్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు. హాస్పిటల్ ప్రాంగణంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టంను అభివృద్ధి చేయాలని, రోగుల సహాయకుల కోసం ధర్మశాల, హాస్పిటల్‌లో రెండు క్యాంటీన్‌లను ఏర్పాటు చేయాలని, పరిపాలన భవనం, టీబీ హాస్పిటల్ బోర్డు ఆఫీసు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రధాన ద్వారంలో పోలీస్ అవుట్ పోస్టును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్న హాస్పిటల్‌లో డ్రైనేజీ, శానిటేషన్ నిర్వహణ, వాటర్ సప్లై వంటి సేవలు నిరంతరం కొనసాగేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆస్పత్రిలో అధునాతన ఇంటీరియర్, లాంజ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. విదేశీ రోగుల కోసం ఏర్పాటు చేసిన బ్లాక్స్‌లో ఆధునిక సౌకర్యాలకు పెద్దపీట వేయాలని సూచించారు. అంతర్జాతీయ స్థాయి లేబరేటరీ ఏర్పాటుపై డీఎంఈ, హెచ్‌వోడీ, వైద్య మాలిక సదుపాయాల కల్పన సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో కమిటీని మంత్రి ఏర్పాటు చేశారు. టిమ్స్ పూర్తిస్థాయిలో ప్రారంభించేందుకు అవసరమైన కొనసాగింపు పనులు పూర్తి చేసేందుకు అంచనాలను రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రతిపాదిత పరిపాలన భవనంలో ఆస్పత్రి నిర్వహణ, మెరుగైన వైద్య సేవల కల్పన, సివిల్ వర్క్స్‌ను శరవేగంగా పూర్తి చేయడంపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ లక్ష్యాలు, హాస్పిటల్ నిర్వహణ, మెరుగైన వైద్య సేవల కల్పనపై వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు మంత్రి దిశా నిర్దేశనం చేశారు. మంత్రి వెంట వైద్య ఆరోగ్య ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్ చొంగ్తు, రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్, తెలంగాణ వైద్య, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఎండీ హనుమంతు, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, ఆర్ అండ్ బి శాఖ ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *