సెల్ఫ్ ఎన్యుమరేషన్ లో వివరాలు నమోదు చేసుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

*సెన్సస్ 2027 లో పాల్గొని విజయవంతం చేయండి – సీ.ఎస్ రామకృష్ణారావు*

2027 సెన్సెస్ లో భాగంగా నేడు ప్రారంభమైన (Self-Enumeration లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణ రావు ఆదివారం పాల్గొని తమ వివరాలు నమోదు చేసుకున్నారు. నేడు ఉదయం తన నివాసంలో ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా తన స్వీయ గణన పూర్తి చేసి, తెలంగాణలో సెన్సస్ ఆఫ్ ఇండియా–2027 కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్, సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ భారతి హోలికేరి, మరియు GHMC కమిషనర్ ఆర్. వి. కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక అలా పాల్గొన్నారు.
𝗖𝗲𝗻𝘀𝘂𝘀 𝟮𝟬𝟮𝟳లో ప్రతి కుటుంబం లెక్కలో చేరేందుకు ముందుకు వచ్చి స్వీయ గణనలో పాల్గొనాలని సీ.ఎస్ పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *