– టీపీసీసీ జూమ్ మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 15 : ఎస్ఐఆర్‌ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో ఉన్న మొత్తం ఓట్లలో మెజారిటీ శాతం ఓట్లను ఏదో ఒక కారణంతో పక్కనపెడతారని, అనుమానాస్పదం పేరుతో వాటిని తొలగించే ప్రయత్నం జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా అత్యంత ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఎస్ఐఆర్ అంశంపై టీపీసీసీ జూమ్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. 2028 ఎన్నికలకు 2026 అక్టోబరులోనే ఓటర్ల జాబితా ఫైనల్ అవుతుందని, ఓట్లు తొలగిపోతే తరువాత చేసేదేం ఉండదని స్పష్టం చేశారు. 119 నియోజకవర్గాలలో ప్రతీ గ్రామంలో, ప్రతీ బూత్‌లో బీఎల్‌వోలతో ముఖ్య నాయకులను అనుసంధానం చేసుకోవాలని సూచించారు. వలసలు వెళ్లిన ఓటర్లు బీఎల్‌వోలు వెళ్ళినపుడు నివాసంలో ఉండకపోవచ్చునని, అలాంటి ఓట్లను తొలగించకుండా జాగ్రత్త వహించాలని అన్నారు. ఈ నెల 20లోగా జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు సంబంధిత పార్లమెంటు, అసెంబ్లీ ఇన్‌చార్జిలతో సమీక్ష నిర్వహించుకోవాలన్నారు. సంబంధిత ఇన్‌చార్జ్ మంత్రులు జిల్లాస్థాయిలో మానీటరింగ్ సిస్టం ఏర్పాటు చేసుకుని నిరంతరం పర్యవేక్షించాలని కూడా సూచించారు. ఎక్కడైనా సమస్య వస్తే సంబంధిత అసెంబ్లీ ఇన్‌చార్జిని అప్రమత్తం చేయాలన్నారు. 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఎక్కడైనా సమస్య వస్తే అది సంబంధిత పార్లమెంట్ ఇన్‌చార్జిదే బాధ్యత అని హెచ్చరించారు. అసెంబ్లీ పరిధిలో అసెంబ్లీ ఇన్‌చార్జిలు బాధ్యత వహించాలన్నారు. ఎస్ఐఆర్‌ను ఆషామాషీగా తీసుకోవద్దని, . సీరియస్‌గా తీసుకోవాల్సిందేనని అన్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన సందర్భం అని, గాంధీ భవన్‌లో వార్ రూమ్ ఏర్పాటు చేసి బూత్ లెవెల్ మానీటరింగ్ చేయాలన్నారు. ఏ రోజుకు ఆ రోజు రిపోర్టు తెప్పించుకోవాలి ఎవరు నిర్లక్ష్యం వహించినా నష్టం జరుగుతుందని హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





