ముగ్గురి ప్రాణాలు తీసిన ఫొటోషూట్‌ ‌సరదా

– చెరువులో పడి ముగ్గురు స్నేహితుల మృతి

మేడ్చల్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 15: ‌మేడ్చల్‌ ‌జిల్లా కీసర పోలీసు స్టేషన్‌ ‌పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌ ‌కోసం ఫొటోషూట్‌కు వచ్చిన ముగ్గురు యువకులు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ధర్మారం గ్రామంలోని బాణమ్మ చెరువు వద్ద సరదాగా ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు వచ్చిన ఆంటోనీ (18), జోసెఫ్‌ (18), ‌టోనీ (17) ప్రమాదానికి గురయ్యారు. ఫొటోషూట్‌ ‌సందర్భంగా నీటిలో పడిపోయిన హెడ్‌ఫోన్స్ ‌తీసుకోవడానికి చెరువులోకి దిగిన యువకులు ప్రమాదవశాత్తూ నీటిలో గల్లంతయ్యారు. మృతులు బొల్లారం ప్రాంతానికి చెందిన స్నేహితులుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మరో యువకుడి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సరదాగా వెళ్లిన ముగ్గురు స్నేహితులు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదకర ప్రాంతాల్లో ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేటప్పుడు యువత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. సోషల్‌ ‌మీడియా కోసం ప్రాణాలకు ముప్పు కలిగించే సాహసాలకు దూరంగా ఉండాలని మేడ్చల్‌ ‌జిల్లా పోలీసులు హెచ్చరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *