బతుకమ్మ పోస్టర్ ఆవిష్కరించిన సీఎస్

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 8 : రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవో) మహిళా విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా టజీవో మహిళా విభాగం రూపొందించిన బతుకమ్మ పోస్టర్‌ను ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సంజయ్ జాజు సచివాలయంలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిందన్నారు. తెలంగాణ ఆడపడుచుల సాంస్కృతిక ఐక్యతకు, ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి బతుకమ్మ ఒక గొప్ప ప్రతీక అని అన్నారు. రాష్ట్రంలో బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాలతో, సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. ఉద్యోగినులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో భాగస్వాములు కావాలని సీఎస్ సూచించారు. టీజీవో మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు. బతుకమ్మ తెలంగాణ ఆడపడుచుల జీవన విధానంలో అంతర్భాగమని, పూలతో బతుకమ్మను పేర్చి, ప్రకృతిని ఆరాధిస్తూ, సమష్టిగా పాటలు పాడుతూ నిర్వహించే ఈ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిందని టీజీవో మహిళా విభాగం నాయకులు పేర్కొన్నారు. మహిళా ఉద్యోగులందరూ బతుకమ్మ వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీ.జీ.ఓ. మహిళా విభాగం పిలుపునిచ్చింది. పోస్టర్ ఆవిష్కరణలో టజీవో అసోసియేషన్ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్ రావు, జనరల్ సెక్రటరీ బి.శ్యామ్, మహిళా విభాగం చైర్పర్సన్ డాక్టర్ జి.దీపా రెడ్డి, కన్వీనర్ జె.సుజాత, శాంతిశ్రీ, కిరణ్మయి, పూనం, అనిత,మమత, చంద్రజ్యోతి, వనజ, వివిధ శాఖల మహిళా గెజిటెడ్ అధికారులు, ఉద్యోగినులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *