చూపించిన అలనాటి తెలంగాణ కవి!
కాకతీయ కలగూర గంప – 23
అలనాటి నిజాం పాలిత హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు కవులున్నారా? అని అపహాస్యం చేసే రోజుల సంఘటన ఇది.ప్రఖ్యాత జంట కవులు, అవధాన పం• •తులైన ‘తిరుపతి వెంకట కవులు’ అంటే ఏ కొద్దిమంది కవులకు మాత్రమే తెలుసు. కాని 1960 -70 లలో విడుదలై శ్రీ కృష్ణ రాయబార సన్నివేశాలను చూపించిన అనేక సినిమాలలో శ్రీ కృష్ణ పాత్రధారి యన్ టి రామారావు గారు ఒక చేతిలో మురళిని ఝలిపిస్తూ అద్భుత హావభావాలతో రాగయుక్తంగా చదివిన ఆ గొప్ప పద్యం ‘‘జెండా పై కపి రాజు’’ మరియు ఇతర పద్యాలు రాసింది తిరుపతి వెంకట కవులే అని తెలిస్తే అప్పుడు సామాన్య జనులకు కూడా వారి పాండిత్య ప్రభావం తెలుస్తుంది.
దివాకర్ల తిరుపతి శాస్త్రి (1872-1919), చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి (1870-1950) – ఈ ఇద్దరు కవులు ‘తిరుపతి వేంకట కవులు’ గా ప్రసిద్ధి చెందిన జంట కవులు. వారు రాసిన ‘‘పాండవోద్యోగ విజ యాలు’’ అనే నాటకంలోని పద్యాలు తెలుగునాట ఊరూరా మారు మ్రో గాయి.చాలా మంది చదువురాని వాళ్ళు కూడా ‘‘బావా ఎప్పుడు వచ్చితీవు’’, ‘‘చెల్లియొ చెల్లకొ’’, ‘‘జెండాపై కపిరాజు’’ అనే పద్యాలను పాడ గలిగేవారు. వీరి అవధాన పూరణలు, చమత్కారాలు పండితలోకంలో ప్రసిద్ధములు.
వీరిద్దరు ఇంచుమించుగా వంద సంస్కృత మరియు తెలుగు గ్రంథాలు, నాటకములు మరియు అనువాదాలు వ్రా శారు. అవధానాల్లో వీరి పాండిత్యం, ప్రతిభ, చమత్కార చాతుర్యం సాహితీ సమాజంలోతరతరాలుగా చెప్పుకొనబ డుతు న్నాయి. వేంకట శాస్త్రి అధ్యాపకునిగా ఉన్నపుడు ఆయన శిష్యులుగా ఉండి, తరువాత సుప్రసిద్ధులై నవారిలో కొందరు – విశ్వనాధ సత్యనారాయణ, వేటూరి సుందరరామ మూర్తి, పింగళి లక్ష్మీకాంతం.మొదటినుండి తిరుపతి శాస్త్రి వాదనా పటిమ అసాధారణంగా ఉండేది. ఇక వేంకట శాస్త్రి పురాణ సాహి త్యాలపై ఉప న్యాసా లివ్వడంలో దిట్ట. జీవి తాంతం ఆ సాహితీ మూర్తులు ఒకరికొకరు తోడు న్నారు. తిరుపతి శాస్త్రి సదా వేంకటశాస్త్రిని తన గురువుగా భావించాడు. తిరుపతి శాస్త్రి మరణానంతరం కూడా వేంకట శాస్త్రి తన రచనలను జంట రచనలుగానే కొనసాగించారు.
చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి శిష్యుడు పింగళి లక్ష్మికాంతం. ఆయన శిష్యుడు పువ్వాడ శేషగిరి రావు. ఆయన శిష్యుడు పిళ్ళా వేంకట రత్నం. పిళ్ళా కవి రాసిన ‘విజయ కుమారం’ అనే చిన్న కావ్యాన్ని ఆవిష్కరిస్తూ చెళ్లపిళ్ల వారు పైన తెలిపిన శిష్యపరంపర ను పేర్కొని‘ఈ విధంగా నా కవితా వంశం వృద్ధి చెందుతున్నది. నా కింకేం కావాలి?’ అని సంతృప్తిని వెలిబుచ్చారట.
– శ్రీమతి పాములపర్తి చంద్రకీర్తి
– పాములపర్తి నిరంజన్ రావు





