– సీఎం అమెరికా పర్యటనను తిరస్కరించడం నిరంకుశత్వమే
– మంత్రి పొన్న ప్రభాక్ విమర్శలు
సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందంటూ బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధి కోసం విదేశీ పర్యటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తే అనుమతి నిరాకరించడం కేంద్రం నిరంకుశత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. ఈ సందర్భంగా కేంద్రం తీరుపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. దీనిపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పల్లె పల్లెకు పొన్నం అన్న- ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో మంత్రి పొన్నం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెబుతున్న ’వికసిత్ భారత్-2047’ లక్ష్యం నెరవేరాలంటే ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణకు న్యాయంగా రావాల్సిన ఆర్థిక సహకారం, నిధుల విషయంలో కేంద్రం సానుకూలంగా వ్యవహరించాలన్నారు. ఎన్డీయే ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల కోసం రాష్ట్ర బీజేపీ నాయకులు ఎందుకు గళమెత్తడం లేదని మంత్రి ప్రశ్నించారు. కేంద్రం పక్క రాష్టాల్రకు నిధులు ఇస్తున్నప్పుడు తెలంగాణకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదని వారిని సూటిగా ప్రశ్నించారు. రాజకీయాలకతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. అదే విధంగా కేంద్రం కూడా రాష్టాభ్రివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ’ప్లలె ప్లలెకు పొన్నం అన్న- ప్లలె ప్లలెలో ప్రజా పాలన’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో ప్రజలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు మంత్రి పొన్నం వెల్లడించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





