– అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రి సీతక్క
కొత్తగూడ, ప్రజాతంత్ర, ఆగస్టు 22 : మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఓటాయి గ్రామ సర్పంచ్ గట్టి రాములు శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటుతో మరణించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆయన నివాసంలో సర్పంచ్ రాములు పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి అంత్యక్రియల్లో పాల్గొని సర్పంచ్ రాములు పాడె మోశారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని దైర్యం చెప్పి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిత్యం ప్రజా సేవలో ముందుండి గ్రామ అభివృద్ధి కోసం కష్టపడే వ్యక్తి ఈ రోజు లేకపోవడం చాలా బాధాకరమని మంత్రి సీతక్క అన్నారు. మంత్రి సీతక్కతోపాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, చైర్మన్లు, డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ నాయకులు సీనియర్ నాయకులు ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





