– ఇద్దరి మృతి.. మరొకరికి తీవ్ర గామాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : గచ్చిబౌలి అంజయ్య నగర్‌లో ఏడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా రమణారెడ్డి అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని స్థానిక హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందజేస్తున్నారు. నాలాను ఆనుకుని 50 గజాల్లో అక్రమంగా ఈ భవనాన్ని నిర్మించారు. ఈ నిర్మాణం కూలి పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌పై శకలాలు పడ్డాయి. భయంతో పక్కనే ఉన్న హాస్టల్లోకి విద్యార్థులు పరుగులు తీశారు. సంఘటన స్థలానికి హైడ్రా, డీఆర్‌ఎఫ్ టీమ్స్ చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. సీఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఈ భవనం నిర్మిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గతంలో ఈ నిర్మాణానికి సీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు ఇచ్చారు. క్షేత్రస్థాయిలో టౌన్ ప్లానింగ్ అధికారులకు ముడుపులిచ్చి ఈ భవనాన్ని యజమాని నిర్మిస్తున్నట్లు సమాచారం. బిల్డింగ్ నిర్మాణాన్ని ఖాజా అనే వ్యక్తి చేపట్టాడు. అంజయ్య నగర్‌లో అత్యంత ప్రమాదకర స్థాయిలో భవనాలు నిర్మిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఖాజా నిర్మిస్తున్న అక్రమ భవనంపై పలుమార్లు పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్ వాసులు ఫిర్యాదు చేశారు. అయినా హైడ్రా, సీఎంసీ సిబ్బంది పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తు న్నారు. రెండేళ్ల క్రితం ఇదే అంజయ్య నగర్‌లో ఐదు అంతస్తుల భవనం పక్కకు ఒరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు