Category తెలంగాణార్థం

కర్రెగుట్టల ఉదంతం లేవనెత్తుతున్న ప్రశ్నలు

ఏప్రిల్‌ 21 నుంచి మూడు వారాలుగా తెలంగాణ – ఛత్తీస్‌ గడ్‌ సరిహద్దుల్లోని కర్రెగుట్టలను చక్రబంధం చేసిన భారత ప్రభుత్వ సాయుధ భద్రతా బలగాలు, అర్ధసైనిక బలగాలు సాధించదలచుకున్నదేమిటి అనే ప్రశ్న ఇవాళ ప్రతి ఒక్కరూ ఆలోచించవలసి ఉంది. మూడు వారాలుగా సాగుతున్న ఈ ప్రక్రియలో భద్రతా బలగాలు ఇప్పటికి కొన్ని కొండలను ఆక్రమించి, వాటి…

తెలంగాణ జనహృదయంలో న్యాయ భావన

లక్షలాది మంది హాజరైన ఎల్కతుర్తి బహిరంగ సభలో భారత రాష్ట్ర సమితి నాయకులు కె చంద్రశేఖర రావు ‘కగార్‌ ఆపరేషన్‌ను ఆపెయ్యాలె’, ‘అధికారం ఉన్నదని చంపుకుంట పోతరా’, ‘గిరిజనుల ఊచకోతను ఆపెయ్యాలె’, ‘నక్సలైట్లతో చర్చలు జరపాలె’ అని అంటుంటే సభ మొత్తం చప్పట్లతో ఆమోదం తెలిపింది. ‘ఈ మాట దిల్లీకి ఉత్తరం రాద్దామా’ అని ఆయన…

ఈ హత్యాకాండలో చేతులు కలపకండి!

తెలంగాణ ముఖ్యమంత్రికి బహిరంగలేఖ గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారూ, మన రాష్ట్రానికీ ఛత్తీస్ గడ్ రాష్ట్రానికీ సరిహద్దులలో, జయశంకర్ భూపాల్ పల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో, కర్రెగుట్టల ప్రాంతంలో ఇవాళ రేపట్లో ఒక భయానకమైన మారణకాండ జరగనున్నదని వార్తలు వస్తున్న పరిస్థితులలో, మీ తక్షణ స్పందన కోసం, తగిన చర్యల కోసం ఈ బహిరంగ లేఖ.  …

ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారమైనట్టేనా?

రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 14 సోమవారం నాడు జారీ చేసిన నాలుగు జీఓ లు, అంతకు ముందు మార్చ్‌ 18న శాసనసభ ఆమోదించి, ఏప్రిల్‌ 9న గవర్నర్‌ ఆమోదం పొంది చట్టంగా తయారైన ది తెలంగాణ షెడ్యూల్డ్‌ కాస్ట్స్‌ (రేషనలైజేషన్‌ ఆఫ్‌ రిజర్వేషన్స్‌) చట్టం 2025, మూడు దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను, తెలంగాణాను నిరం తరంగా…

భూమి ప్రభుత్వానిది ఎలా అవుతుంది?

హైదరాబాద్‌ ‌విశ్వవిద్యాలయ భూవివాదంలో ఆర్టిఫిషియల్‌ ఇం‌టిలిజెన్స్ ‌ద్వారా తయారుచేసిన చిత్రం తప్పు అని ప్రభుత్వం పెద్ద ఎత్తున యాగీ చేస్తున్నది, తప్పుడు కేసులూ, అక్రమ నిర్బంధాలూ కూడా అమలు చేస్తున్నది. కాని ఆ చిత్రానికి దారి తీసిన పరిణామాలన్నీ పరిశీలిస్తే, ప్రభుత్వం చేసిన తప్పులూ, ఆడుతున్న అబద్ధాలూ, వాస్తవాలను తారుమారు చేయడమూ వంటి అనేక అంశాల…

రాజ్య హింసకు వత్తాసు పలుకుతున్న ‘మేతావులు’!

ఐదు దశాబ్దాల కిందనే ‘శిశు హంతక రాజ్యం ఇది, పశు సంతతి పాలన ఇది’ అని ఈ దేశపు రాజ్య స్వభావాన్నీ, పాలనా ప్రవృత్తినీ ఒక్కమాటలో చెప్పాడు చెరబండరాజు. అటువంటి రాజ్యంలో‘నేరమే అధికారమై/ ప్రజల్ని నేరస్తుల్ని చేసి వేటాడుతుంటే/ ఊరక కూర్చున్న/ నోరున్న ప్రతివాడూ నేరస్తుడే’ అన్నాడు వరవరరావు. యాబై ఏళ్ల కింద తెలుగు సమాజం…

కీచులాటలు మాని, కీలక సమస్యలపై మాట్లాడండి!

గత శనివారం చెన్నైలో ఒక అపూర్వ సమావేశం జరిగింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్‌ పూనిక మీద జరిగిన ఈ సమావేశంలో ఆయనతో పాటు కేరళ, పంజాబ్‌, తెలంగాణ ముఖ్యమంత్రులు, కర్ణాటక ఉపముఖ్యమంత్రి, పద్నాలుగు రాజకీయ పక్షాల నేతలు పాల్గొన్నారు. దేశ రాజకీ యాలలో భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్ట దలచిన కీలకమైన మార్పులను…

జర్నలిస్టుల లిస్టులు తయారు చేసేదెవరు?

 ‘‘ఉప్పు పాతరేస్తా…’’. ‘‘ఎవ్వరినీ వదలను.’’ ‘‘మీడియా మిత్రులను, సంఘాల నాయకులను అడుగుతున్నా. జర్నలిస్టులెవరో లిస్టు ఇవ్వండి. జర్నలిస్టు అనే పదానికి డెఫినిషన్‌ ‌చెప్పండి. ఆ లిస్టులో ఉన్నవాళ్లు ఇట్లా తప్పు చేస్తే మీరు ఏమి శిక్ష విధిస్తారో చెప్పండి. ఆ లిస్టులో లేనివాడు జర్నలిస్టు కాదు. క్రిమినల్స్ ‌గానే చూస్తాం. ఎట్ల జవాబు చెప్పాల్నో అట్లనే…

వరంగల్‌ కు గాలిమోటరూ, గాలి మాటలూ!

ఎట్టకేలకు వరంగల్‌ (మామునూరు) విమానా శ్రయం కదలిక ప్రారంభమయింది. రాష్ట్రంలో హైదరా బాద్‌ (శంషాబాద్‌) అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత రెండో విమానాశ్రయంగా వరంగల్‌ విమానా శ్రయం రాబోతున్నది. నిజానికి రెండో ప్రపంచ యుద్ధ కాలానికి ముందే 1930లలో నిర్మాణమైన ఈ విమానాశ్రయం ఇరవయో శతాబ్ది తొలి అర్ధభాగంలో దేశంలో ప్రధానమైన విమానాశ్రయాల్లో ఒకటిగా ఉండిరది. అది…