Category తెలంగాణార్థం

రసవత్తర స్థానిక సంస్థల ఎన్నికల ప్రహసనం!

“ఎన్నికల ఫలితాల మీద ప్రతి ఒక్కరికీ భయమూ అనుమానమూ ఉన్నాయి గాని ఏ ఒక్క రాజకీయ పార్టీకి కూడా నిజంగా ఎన్నికలకు వెళ్లాలని లేదు. అటువంటి వైఖరి అధికారపక్షానికి మరింత ఎక్కువగా ఉంది. ఎన్నికలను జరపక పోవడం ద్వారా గ్రామాల మీద ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు కాక ప్రభుత్వాధికారులకే అధికారం వస్తుంది. అంటే ప్రభుత్వానికి నిధుల…

వెంటిలేటర్ మీద తెలంగాణ ఆర్థిక వ్యవస్థ!  

Telangana Economy on a Ventilator Rising Debt and Fiscal Challenges Exposed

“విద్యార్థుల ఫీజుల రియింబర్స్ మెంట్ కింద ప్రైవేటు కాలేజీలకు ప్రభుత్వం చెల్లించవలసిన బకాయిలు ఆరు సంవత్సరాలుగా పేరుకు పోయాయనీ, అవి ఎనిమిది వేల కోట్ల రూపాయల పైనే ఉంటాయనీ తెలుస్తున్నది. అలాగే విభిన్న వర్గాల పేద, మధ్యతరగతి ప్రజలకు, ఉద్యోగులకు, పెన్షనర్లకు వర్తించే ఆరోగ్యసేవల పథకం ఆరోగ్యశ్రీ కింద ప్రైవేటు హాస్పిటల్స్ కు  ప్రభుత్వం చెల్లించవలసిన…

తెలంగాణ కుల హత్యల భూమిగా మారుతున్నదా?

“వీరిలో ఒక్కొక్కరిదీ ఒక విషాద గాథ. కొన్ని గాథలు మిగిలినవాటికన్నా ఎక్కువ ప్రచారంలోకి వచ్చి ఉండవచ్చు. అసలు నమోదే కాని, వార్తలకెక్కని ఘటనలు మరెన్ని ఉన్నాయో తెలియదు. కాని ఇంకా ఇరవైల్లో ప్రవేశించని, లేదా ఇరవైల తొలిరోజుల్లోని ఈ యువతీ యువకులు ఒక్కొక్కరూ తమ హృదయం చెప్పిన మాట విన్నారు. సామాజిక కట్టుబాట్లను లెక్కచేయగూడదనుకున్నారు. కుల…

బహుముఖాలుగా సాగవలసిన మరో గ్రంథాలయోద్యమం!

మరో గ్రంథాలయోద్యమం నిజంగా విజయం సాధించాలంటే అది కనీసం మూడు స్థాయిలలో విస్తరించాలి. మొదట వ్యక్తుల, కుటుంబాల, స్నేహ బృందాల స్థాయిలో పుస్తక పఠనం పెరగాలి, ప్రతి ఒక్కరూ తన వంతుగా తాను ప్రతి రోజూ ప్రతి వారమూ ఏమి చదువున్నానో ఆలోచించుకోవాలి. అందువల్ల గ్రంథాలయ అవసరం గురించి అవగాహన పెరుగుతుంది. అప్పుడు గ్రంథాలయాల ఏర్పాటు…

యూరియా కూడా రాజకీయ వస్తువే!

“అలా యూరియా మితిమీరిన వినియోగం అనే ఒక కారణం ఉండగా, దాన్ని సవరించవలసిన, రైతాంగానికి నచ్చజెప్పి యూరియా వాడకం తగ్గించవలసిన వ్యవసాయ శాఖ ఆ పని చేయకపోవడం వల్ల యూరియా అవసరం పెరిగిపోతూనే ఉంది. ఈ స్థితిలో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు, వరి సాగు విస్తీర్ణం ఈ సంవత్సరం ఖరీఫ్ లో హఠాత్తుగా…

‘మార్వాడీ గోబ్యాక్’ జాతి సమస్య కాదు, దోపిడీ సమస్య!

“మొత్తం మీద ఈ గందరగోళపు సమస్య చిలికి చిలికి గాలివాన అవుతున్నది. ఎప్పుడైనా ఒక పరిణామం ఒక దశకు వచ్చినప్పుడు అదేదో హఠాత్తుగా జరిగిందని చాలామంది భావిస్తారు. కాని, ప్రకృతిలో, సమాజంలో ఇటువంటి దశలు హఠాత్తుగా ఏమీ రావు. ఎంతోకాలంగా ఆ పరిణామం నిశ్శబ్దంగా, పైకి కనబడకుండా జరుగుతూ జరుగుతూ ఏదో ఒక ఘటన దగ్గర…

అందరూ బీసీలకు మద్దతే, కాని ఒరిగిందేమీ లేదు!

BC quota is the buzzword in Telangana politics today.

“వెనుకబాటుతనాన్ని గుర్తించడానికి ప్రాతిపదిక ఏమిటనే విషయంలోనే భిన్నాభిప్రాయాలు ఉండగా, షెడ్యూల్డ్ కులాల, తెగల జన సంఖ్య విషయంలో కచ్చితమైన జనగణన అంకెలు ఉన్నట్టుగా, ఇతర కులాల విషయంలో అంకెలు అందుబాటులో లేవు. అందువల్ల వెనుకబడిన కులాలకు కచ్చితమైన రిజర్వేషన్ కోటా నిర్ధారించడం జరగలేదు. అసలు వెనుకబడిన కులాలు (కాస్ట్స్) అని కూడా అనకుండా వెనుకబడిన తరగతులు/వర్గాలు…

పిడికెడు నిజాలూ, బండెడు రాజకీయాలూ!

“ఇప్పటికి ఇంకా జస్టిస్ పి సి ఘోష్ ఏమి రాశారో, ఆ 650 పేజీల తిలకాష్ఠమహిషబంధనం బైటపడలేదు గనుక ఆ నివేదిక మీద వ్యాఖ్యానించడం న్యాయం కాదు. ఆ నివేదికను అధ్యయనం చేసి సారాంశం వివరించమని ప్రభుత్వం ముగ్గురు అధికారుల బృందాన్ని నియమించగా, ఆ బృందం రెండంటే రెండు రోజుల్లో ఆ 650 పేజీలు చదివి,…

పులుల ఆవాసం కోసం ఆదివాసుల నిర్వాసం!

“ప్రభుత్వ గణాంకాల ప్రకారం కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 434 గ్రామాలుండగా అందులో 339 గ్రామాలు, అంటే 80 శాతం పులుల రిజర్వ్ లోకి వస్తాయంటే ఆ ఆదివాసీ జిల్లా స్వభావమే మారిపోతుందన్నమాట. అది ఆదివాసుల జిల్లా స్థానం నుంచి పులుల జిల్లా స్థానానికి మారుతుందన్నమాట. అలా జిల్లాను పులులకు వదిలేసినతర్వాత ఆదివాసులకు ఏమవుతుంది…