Category తెలంగాణార్థం

ఎందరెందరి చేతుల మీద సిగాచి కార్మికుల నెత్తురు?

కాని ఆ నిర్లిప్తతను వదిలి, లోతుగా ఆలోచిస్తే సిగాచీ దురంతాన్ని వాస్తవంగా మారణకాండ అనాలి. యాజమాన్యం, ప్రభుత్వ సంస్థలు ఎన్నో ఏళ్లుగా పరిశ్రమ నిర్వహణలో చూపిన బాధ్యతా రాహిత్యం వల్లనే ఈ దుర్ఘటన జరిగింది. ఇవాళ జరిగిన మరణాల స్థాయి అనూహ్యమైనది కావచ్చు గాని, ఏదో ఒక స్థాయి దుర్ఘటన జరగడానికి అన్ని ఏర్పాట్లూ ఎప్పటి…

తెలంగాణ ఎట్లుండాల్నో చెప్పడానికి అమిత్ షా ఎవరు?!

డి శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికీ, పసుపు బోర్డ్ ప్రకటించడానికీ ఆదివారం నాడు నిజామాబాద్ వచ్చిన   కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా బహిరంగ సభలో నక్సలైట్ల గురించీ, తెలంగాణ గురించీ అనుచిత ప్రస్తావనలు చేశాడు. తెలంగాణ ప్రభుత్వానికీ, ప్రత్యేకించి రేవంత్ రెడ్డి పేరు చెప్పి మరీ ముఖ్యమంత్రికీ, హెచ్చరికలు చేశాడు. అటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ…

కాళరాత్రి నిజంగా అంతమయిందా?!

తన ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తారుమారు చేయడానికి ప్రధాని ఇందిరా గాంధీ సలహాతో రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ దేశంలో ఎమర్జెన్సీ విధించి, ప్రాథమిక హక్కులు రద్దు చేసి, పత్రికల మీద సెన్సార్ షిప్ విధించి, దేశాన్ని చీకటిరాజ్యంగా మార్చిన పరిణామానికి ఈ జూన్ 25 అర్ధరాత్రికి యాబై ఏళ్లు నిండాయి.…

ప్రజల ప్రదర్శన అంటే ఏలినవారికి ఎందుకింత భయం?!

ప్రభుత్వం ఎక్కువా? ప్రజలు ఎక్కువా? ప్రజలు చెల్లించే పన్నులతో నడిచే ప్రభుత్వం, ప్రజలు వోట్లు వేసి ఎన్నుకుంటే మాత్రమే ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండే ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో భాగమైన అధికారవర్గం ప్రజల దయ వల్ల అక్కడ ఉన్నామనే విషయాన్ని మరిచిపోతున్నారా?  ప్రభుత్వోద్యోగి, ప్రభుత్వాధికారి అనే మాటలు ఇటీవలివి గాని, అంతకు ముందు వాళ్లను పబ్లిక్…

పెద్ద ధన్వాడలో ధ్వనించిన ప్రజాగ్రహం!

Pedda Dhanwada ethanol factory issue, Ethanol plant controversy Telangana, Pedda Dhanwada village protest, Ethanol factory environmental impact, Telangana ethanol project news, Ethanol plant opposition Telangana, Rural protests against factories, Pedda Dhanwada latest news, Industrial projects in Telangana, Ethanol production in India

గత బుధవారం, జూన్ 4న, జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామ శివార్లలో ఇథనాల్ కర్మాగారం నెలకొల్పడానికి గాయత్రీ రిన్యూవబుల్ ఫ్యుయల్స్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్ చేస్తున్న ప్రయత్నాలను ఆ కర్మాగార కాలుష్యం వల్ల బాధితులు కానున్న గ్రామస్తులు, పొరుగు గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. కంపెనీ తీసుకువచ్చిన ప్రైవేటు సైన్యమూ, బౌన్సర్లూ ప్రజల మీద దాడిచేసి మరియమ్మ…

పదకొండేళ్ల ఫలహారపు, ప్రతీకారపు తెలంగాణ!  

మనం సాధించుకోవలసినది ఏమిటి, భౌగోళిక తెలంగాణనా, ప్రజాస్వామిక తెలంగాణనా, సామాజిక తెలంగాణనా అని తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తీవ్రమైన చర్చలు, వాదోపవాదాలు జరుగుతుండేవి. ఎవరికి వాళ్లు తమ భావనల మీద గట్టిగా వాదనలు వినిపిస్తుండేవారు. ఉన్న వ్యవస్థ లోపల ప్రజాస్వామిక తెలంగాణ, సామాజిక తెలంగాణ సాధించడం సాధ్యం కాదని, అందువల్ల మొట్టమొదట కనీసమైన భౌగోళిక తెలంగాణ సాధించుకుంటే, తెలంగాణ ఏర్పడిన తర్వాత దాన్ని సామాజికీకరించడం…

ఎన్ కౌంటర్, అనంతర పరిణామాలలో మన అవ్యవస్థ

దేశంలో మావోయిస్టులు లేకుండా చేసే లక్ష్యంతో పదిహేడు నెలలుగా సాగుతున్న ఆపరేషన్ కగార్ లో భాగంగా ఛత్తీస్ గడ్ నారాయణపూర్ జిల్లా గుండె కోట్ లో మే 21న జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబళ్ల కేశవరావుతో సహా 28 మంది చనిపోయారు. ఈ ఎన్ కౌంటర్, దాని తర్వాత…

ఇప్పుడు రభస, మరొక ప్రమాదం దాకా మౌనం!!       

చార్మినార్ గుల్జార్ హౌజ్ అగ్ని ప్రమాదం హైదరాబాద్ చరిత్రలో ఒక ప్రధానమైన విషాదం. ఒకే ఇంట్లో పదిహేడు మంది హఠాత్తుగా మృత్యువాత పడ్డారు. హృదయమూ, మేధా ఉన్న ప్రతి ఒక్కరినీ కలచివేసిన ఈ దుర్ఘటన గురించి చాలా లోతుగా ఆలోచించవలసి ఉంది. గతంలో ఇటువంటి ప్రమాదాలు జరిగిన తర్వాత ఏయే గుణపాఠాలు తీసుకున్నామో, ఏ పరిష్కార…

‘జరూర్ ఆనా’  స్నేహమా, ఆదేశమా, ప్రాధేయమా? 

  ‘ప్రజలకు రొట్టె ఇవ్వలేకపోతే, సర్కస్ ఇవ్వండి’ అనేది రోమన్ చక్రవర్తులు అనుసరించిన రాజనీతి అని చరిత్ర పుస్తకాలు చెపుతాయి. ఆరుగాలం కష్టం చేసే, మనుషులుగానే గుర్తింపు లేని బానిసలకు కనీసమైన తిండి కూడా ఇవ్వకపోయినా, వారికి వినోదం కల్పించి దృష్టి మళ్లించడానికి ఆనాటి పాలకులు ప్రయత్నించారు. వినోదమంటే ఎంపిక చేసిన బానిసలను మల్లయోధులుగా మార్చి, వారిలో ఎవరో ఒకరు చనిపోయేదాకా వేదిక…