‘‘ఉప్పు పాతరేస్తా…’’. ‘‘ఎవ్వరినీ వదలను.’’ ‘‘మీడియా మిత్రులను, సంఘాల నాయకులను అడుగుతున్నా. జర్నలిస్టులెవరో లిస్టు ఇవ్వండి. జర్నలిస్టు అనే పదానికి డెఫినిషన్ చెప్పండి. ఆ లిస్టులో ఉన్నవాళ్లు ఇట్లా తప్పు చేస్తే మీరు ఏమి శిక్ష విధిస్తారో చెప్పండి. ఆ లిస్టులో లేనివాడు జర్నలిస్టు కాదు. క్రిమినల్స్ గానే చూస్తాం. ఎట్ల జవాబు చెప్పాల్నో అట్లనే జవాబు చెపుతాం. ముసుగు వేసుకొని వస్తే, ముసుగు ఊడ బీకి, బట్టలు ఊడదీసి కొడతా…’’ ‘‘తోడ్కలు తీస్తా’’.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి తెలంగాణ శాసన సభా వేదిక మీద మాట్లాడిన ఈ మాటలు సహజంగానే చాలా చర్చకు, వివాదానికి దారి తీశాయి. దేశవ్యాప్తంగా ఎడిటర్స్ గిల్డ్, కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్టస్ తో సహా కొన్ని జర్నలిస్టు సంఘాలు, కొందరు జర్నలిస్టులు ఈ మాటలను ఖండించారు. కొందరు ఈ మాటలు వచ్చిన నేపథ్యాన్ని కూడా పరిశీలించవలసి ఉంటుందని అన్నారు. మరి కొందరు ముఖ్యమంత్రి ఎవరిని ఉద్దేశించి ఈ మాటలన్నారో వారు చేసినది కూడా జర్నలిజం కాదని, అదే సందర్భంలో ముఖ్యమంత్రి మాటలు కూడా అభ్యంతరకరమని అన్నారు. ఈ పూర్వరంగంలో తెలంగాణలో జర్నలిజం గురించీ, రాజకీయ నాయకత్వపు భాష గురించీ, మొత్తంగానే సామాజిక విలువల్లో పెరిగిపోతున్న దిగజారుడు గురించీ మాట్లాడుకోవలసి ఉంది.
మొట్టమొదట, ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఏ సందర్భంలో చేసినా సరే, ఆ రాజ్యాంగబద్ధమైన పదవికి తగినట్టుగా లేవు. చట్టప్రకారం నడుచుకోవలసిన, చట్టాన్ని పరిరక్షించవలసిన వ్యక్తి చట్టాతీతంగా బట్టలు ఊడదీసి కొడతా, తోడ్కలు తీస్తా, ఉప్పు పాతర వేస్తా, ఎవరినీ వదలను అని బెదిరించడం అభ్యంతరకరం. అవి వీథుల్లో కొట్లాటల్లో ప్రత్యర్థులు ఒకరి మీద ఒకరు విసురుకునే మాటలు. చట్టంలో అటువంటి శిక్షలూ లేవు, అలా శిక్షిస్తామని చట్టబద్ధ అధికారం ఉన్న వ్యక్తులు బెదిరించడమూ సమంజసం కాదు. ఒకవైపు ఈ మాటలు అంటూ, మరొకవైపు చట్టపరిధి దాటి ప్రవర్తించను అనడం కపటత్వమే.
ఈ జర్నలిజం విస్ఫోటన విస్తారంగా సమాచార వితరణకూ, సృజనకూ, వ్యక్తీకరణకూ అవకాశాలను బైటికి తెచ్చిందనే సానుకూల అంశంతో పాటే, నాణ్యత, పరిశీలన, పర్యవేక్షణ, తప్పుల సవరణ లేని ప్రతికూల వాతావరణం ఏర్పడిందనేది నిజం. ప్రధాన స్రవంతి ప్రచార సాధనాలను కొనివేసిన రాజకీయ పక్షాలు, సంపన్న, ఆధిపత్య శక్తులు ఈ ప్రత్యామ్నాయ సామాజిక మాధ్యమాలలోకి కూడా చొరబడ్డాయి. ఐటీ సెల్స్ పేరుతో వందలాది మంది ఉద్యోగులతో తప్పుడు వార్తలూ, వ్యాఖ్యలూ, ప్రత్యర్థుల మీద నిందలూ, దుర్భాషలూ, అబద్ధాలూ వండి వారుస్తున్నాయి. రాజకీయ నాయకుల సంస్కృతిలో భాగమై పోయిన బూతులు, ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననాలు సామాజిక మాధ్యమాలకు కూడా చేరాయి. ఈ నేపథ్యంలో కాపలా కుక్క పాత్ర వహించవలసిన జర్నలిజం పెంపుడు కుక్కగా మారిపోయింది. ఈ దుస్థితికి అన్ని రాజకీయ పక్షాలూ బాధ్యత వహించవలసిందే. నిజానికి ఇవాళ సాగుతున్న చర్చ ఈ కుక్కమూతి పిందె జర్నలిజానికి ఒకానొక ప్రతిఫలనం మీదనే.
అది అలా ఉంచి, తన మీద విమర్శలు లేదా నిందలు వేసే వ్యక్తులు జర్నలిస్టులైనా కావాలి, క్రిమినల్స్ అయినా కావాలి అని ముఖ్యమంత్రి అనడం కూడా అభ్యంతరకరం. మన దేశంలో అమ లులో ఉన్న రాజ్యాంగం ప్రకారం, చట్టాల ప్రకారం పౌరులం దరూ సమానులే. జర్నలిస్టులకేమీ ప్రత్యేక హక్కులూ లేవు, జర్నలిస్టులు కాని వాళ్లందరూ క్రిమినల్సే అనడమూ కుదరదు. జర్నలిస్టులకైనా, కాని వారికైనా మాట్లాడడం, ఆలో చించడం, ప్రశ్నించడం, సంఘటితం కావడం సహజమైన, నైసర్గికమైన మానవీయ అంశాలు. ఆ సహజా తాలను, నైసర్గిక అవకాశాలను రాజ్యం గాని, మరెవరైనా గాని కొల్లగొట్టడానికి వీలు లేదు అని చెప్పడానికే రాజ్యాంగం వాటిని హక్కులుగా ప్రకటించి, హామీ ఇచ్చింది. అలా రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రకటిత హక్కులలో భావ ప్రకటనా స్వేచ్ఛ ఒకటి. ఆ స్వేచ్ఛ ఈ దేశంలో పౌరులందరికీ, జాతి, కుల, మత, ప్రాంత, లింగ, వయో వివక్ష లేకుండా సమానంగా ఉంది. ప్రజలందరికీ ఉన్న ఆ భావప్రకటనా స్వేచ్ఛలో భాగమే జర్నలిస్టుల వ్యక్తీకరణ స్వేచ్ఛ. భావ ప్రకటనా స్వేచ్ఛను వాడుకునే క్రమంలో ఏ పరిమితులు దాటగూడదో కూడా రాజ్యాంగం నిర్దిష్టంగా ప్రకటించింది. ఆ సందర్భంలో కూడా రాజ్యానికి సహేతుకమైన ఆంక్షలు (రీజనబుల్ రిస్ట్రిక్షన్స్) విధించే హక్కు గురించి ప్రస్తావించింది గాని, ఆ హక్కులను రద్దు చేయడానికో, బట్టలు ఊడదీసి కొట్టడానికో, ఉప్పు పాతర వేయడానికో రాజ్యానికి, ప్రభుత్వానికి అధికారం ఇవ్వ లేదు.
ఇంతకూ ప్రస్తుతం ముఖ్యమంత్రికి ఇంతగా కోపం తెప్పించిన వ్యవహారం ఏమిటి? పల్స్ న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్ ప్రభుత్వ విధానాలతో అసంతృప్తితో ఉన్నారని చెప్పబడుతున్న నలుగురైదుగురు వ్యక్తులను ఇంటర్వ్యూ చేసి, ఆ వ్యక్తుల మాటలను యథాతథంగా చానల్ మీద, ఎక్స్ అనే సామాజిక మాధ్యమ వేదిక మీద ప్రసారం చేసింది. ఆ వ్యాఖ్యలలో ముఖ్యమంత్రి మీద, కుటుంబ సభ్యుల మీద బూతులు వాడారు. రక్షణ లేకపోయి ఉంటే ముఖ్యమంత్రిని చంపి ఉండేవాళ్లమని అన్నారు. కాంగ్రెస్ పాలన మీద ప్రజలలో ఏదో ఒక స్థాయిలో అసంతృప్తి పెరుగుతున్నది గనుక నిజంగానే ఆ వ్యాఖ్యాతలు ఆ మాటలు అని ఉండవచ్చు. ఆ వ్యాఖ్యల ప్రసారం మీద అందిన ఫిర్యాదు ప్రకారం, కేసు నమోదు చేసిన పోలీసులు పల్స్ న్యూస్ మేనేజింగ్ డైరక్టర్ ను, ఒక రిపోర్టర్ ను మార్చ్ 12న అరెస్టు చేశారు. మార్చ్ 17న వారికి బెయిల్ వచ్చి విడుదల అయినప్పటికీ మొత్తంగా ఈ వ్యవహారం విస్తృతమైన చర్చకు దారి తీసింది.
ఈ వివాదం ప్రారంభమైనప్పటి నుంచీ, అరెస్టయిన జర్నలిస్టుల పక్షాన నిలబడిన ప్రధాన ప్రతిపక్ష నాయకులు, సమర్థకులు ఆ ఇంటర్వ్యూల మాటలను కడుపు మండిన వారి వ్యాఖ్యలుగా చూడాలని అంటున్నారు. కావచ్చు కూడా. కాని, పత్రికా సంప్రదాయంలో అటువంటి వ్యక్తిగత, అసభ్య, కుసంస్కార వ్యాఖ్యలను తొలగించి ప్రచురించడం అలవాటు. ముద్రణా పత్రికా రంగంలో ఉన్నన్ని జల్లెడలు, అవరోధాలు ఎలక్ట్రానిక్ మాధ్యమాలలో లేకపోయినప్పటికీ, అక్కడ కూడా ఎడిటింగ్ టేబుల్ దగ్గర అటువంటి వ్యాఖ్యలు వినబడకుండా చేసే అలవాటు, సరిగ్గా ఆ అసభ్య మాటలను బీప్ ధ్వనితో చెరిపేసే అలవాటు ఉంది. సామాజిక మాధ్యమాలకు వచ్చేసరికి అసలు ఎటువంటి పర్యవేక్షణ, ఎడిటింగ్ లేకుండా ఇష్టారాజ్యం అమలవుతున్నది.
మొట్టమొదట, ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఏ సందర్భంలో చేసినా సరే, ఆ రాజ్యాంగబద్ధమైన పదవికి తగినట్టుగా లేవు. చట్టప్రకారం నడుచుకోవలసిన, చట్టాన్ని పరిరక్షించవలసిన వ్యక్తి చట్టాతీతంగా బట్టలు ఊడదీసి కొడతా, తోడ్కలు తీస్తా, ఉప్పు పాతర వేస్తా, ఎవరినీ వదలను అని బెదిరించడం అభ్యంతరకరం. అవి వీథుల్లో కొట్లాటల్లో ప్రత్యర్థులు ఒకరి మీద ఒకరు విసురుకునే మాటలు. చట్టంలో అటువంటి శిక్షలూ లేవు, అలా శిక్షిస్తామని చట్టబద్ధ అధికారం ఉన్న వ్యక్తులు బెదిరించడమూ సమంజసం కాదు. ఒకవైపు ఈ మాటలు అంటూ, మరొకవైపు చట్టపరిధి దాటి ప్రవర్తించను అనడం కపటత్వమే.
పల్స్ న్యూస్ రిపోర్టర్ గాని, యాజమాన్యం గాని భాషా ప్రయోగం విషయంలో అటువంటి జాగ్రత్తలు ఏవీ తీసుకోలేదు గనుక అది తప్పనిసరిగా విచారణార్హమైన, శిక్షార్హమైన నేరమే. అయితే, ఆ వ్యాఖ్యలను అలా వదలడం తెలియకుండా, పొరపాటున జరిగినది అయితే సవరించు కోవచ్చు. కాని, ఆ యూట్యూబ్ ఛానల్ ఉద్దేశపూర్వకంగానే ఆ పని చేసిందని దర్యాప్తుతో సంబంధం ఉన్నవాళ్లు అంటున్నారు. అసలు ఆ ఛానల్ ప్రధాన ప్రతిపక్షం చేతుల్లో ఉన్నదని, ఆ ఇంటర్వ్యూలన్నీ ప్రధాన ప్రతిపక్ష కార్యాలయంలో జరిగా యని, అలా తమ వ్యాఖ్యలు వినిపించిన వ్యక్తులు స్వచ్ఛందగా ఆ పని చేయలేదని, ఆ వ్యాఖ్యలు చేసినందుకు వారికి కూలి ముట్టాజె ప్పారని, వారు ఏమి వ్యాఖ్యాని ంచాలో స్క్రిప్టును ఛానల్ యాజ మాన్యమే నిర్ణయించి చెప్పిందని కూడా అంటున్నారు. ఈ ఆరోపణల్లో నిజానిజాలు ఎప్పటికీ బైట పడతాయో తెలియదు.
ఒకవేళ ఆ వ్యాఖ్యలు పొరపాటున ప్రసారం చేసి ఉంటే అది బాధ్యతా రహిత జర్నలిజం. అవి ఉద్దేశపూర్వ కంగా చేసి ఉంటే అది జర్నలిజమే కాదు. బాధ్యతారహిత జర్నలిజానికి పాల్పడి ఉంటే ప్రజలకు, అవమా నానికి గురైన వ్యక్తులకు క్షమాపణ చెప్పి, మరొకసారి ఆ తప్పు చేయ కుండా ఉంటే సరిపోతుంది. ఉద్దే శపూర్వ కంగా చేసి ఉంటే, ప్రభు త్వం చట్ట పరమైన చర్యలు తీసు కోవచ్చు గాని, అది భావప్రకటనా స్వేచ్ఛ మీద దాడిగా కనబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈ నేపథ్యంలో జర్నలిస్టులెవరు, కానివారెవరు అనే చర్చ ముందుకు వచ్చింది గాని, ఇక్కడ కూడా ముఖ్యమంత్రి వేసిన ప్రశ్న, చేసిన సూచనలు అసమంజసమైనవి. రాష్ట్రంలో అనేక రకాల, స్థాయిల జర్నలిస్టులున్నారు.వారందరి పేర్లతో సర్వ సమగ్రమైన జాబితా తయారు చేయడం ప్రభుత్వానికి గాని, జర్నలిస్టు సంఘాలకు గాని, ప్రచార మాధ్యమాల యాజమాన్యాలకు గాని ఎవరికీ వీలు కాదు. రాష్ట్రంలో పత్రికలు మాత్రమే ఉన్నప్పుడు గ్రామ స్థాయి, మండల స్థాయి స్ట్రింగర్లు, విలేఖరుల నుంచి రాజధాని స్థాయి విలేఖరులు, ఉప సంపాదకులు, సహాయ సంపాదకులు, శీర్షికా రచయితలు, సంపాదకీయ రచయితలు, సంపాదకుల వరకు ఎన్నో స్థాయిల జర్నలిస్టులుండే వారు. ఎలక్ట్రానిక్ ప్రచార మాధ్యమాలు వచ్చాక ఈ బాధ్యతలకు తోడు మరెన్నో స్థాయిల, అంచెల జర్నలిస్టు ఉద్యోగాలు వచ్చాయి. ఇక సామాజిక మాధ్యమాలు వచ్చాక పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం, వార్తా, వ్యాఖ్యా ప్రజాస్వామికీకరణ జరిగి, మరెన్నో వేల మంది స్వతంత్ర జర్నలిస్టులు పుట్టుకొచ్చారు.
ఈ జర్నలిజం విస్ఫోటన విస్తారంగా సమాచార వితరణకూ, సృజనకూ, వ్యక్తీకరణకూ అవకాశాలను బైటికి తెచ్చిందనే సానుకూల అంశంతో పాటే, నాణ్యత, పరిశీలన, పర్యవేక్షణ, తప్పుల సవరణ లేని ప్రతికూల వాతావరణం ఏర్పడిందనేది నిజం. ప్రధాన స్రవంతి ప్రచార సాధనాలను కొనివేసిన రాజకీయ పక్షాలు, సంపన్న, ఆధిపత్య శక్తులు ఈ ప్రత్యామ్నాయ సామాజిక మాధ్యమాలలోకి కూడా చొరబడ్డాయి. ఐటీ సెల్స్ పేరుతో వందలాది మంది ఉద్యోగులతో తప్పుడు వార్తలూ, వ్యాఖ్యలూ, ప్రత్యర్థుల మీద నిందలూ, దుర్భాషలూ, అబద్ధాలూ వండి వారుస్తున్నాయి. రాజకీయ నాయకుల సంస్కృతిలో భాగమై పోయిన బూతులు, ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననాలు సామాజిక మాధ్యమాలకు కూడా చేరాయి. ఈ నేపథ్యంలో కాపలా కుక్క పాత్ర వహించవలసిన జర్నలిజం పెంపుడు కుక్కగా మారిపోయింది. ఈ దుస్థితికి అన్ని రాజకీయ పక్షాలూ బాధ్యత వహించవలసిందే. నిజానికి ఇవాళ సాగుతున్న చర్చ ఈ కుక్కమూతి పిందె జర్నలిజానికి ఒకానొక ప్రతిఫలనం మీదనే.
ఈ వివాదం ప్రారంభమైనప్పటి నుంచీ, అరెస్టయిన జర్నలిస్టుల పక్షాన నిలబడిన ప్రధాన ప్రతిపక్ష నాయకులు, సమర్థకులు ఆ ఇంటర్వ్యూల మాటలను కడుపు మండిన వారి వ్యాఖ్యలుగా చూడాలని అంటున్నారు. కావచ్చు కూడా. కాని, పత్రికా సంప్రదాయంలో అటువంటి వ్యక్తిగత, అసభ్య, కుసంస్కార వ్యాఖ్యలను తొలగించి ప్రచురించడం అలవాటు. ముద్రణా పత్రికా రంగంలో ఉన్నన్ని జల్లెడలు, అవరోధాలు ఎలక్ట్రానిక్ మాధ్యమాలలో లేకపోయినప్పటికీ, అక్కడ కూడా ఎడిటింగ్ టేబుల్ దగ్గర అటువంటి వ్యాఖ్యలు వినబడకుండా చేసే అలవాటు, సరిగ్గా ఆ అసభ్య మాటలను బీప్ ధ్వనితో చెరిపేసే అలవాటు ఉంది. సామాజిక మాధ్యమాలకు వచ్చేసరికి అసలు ఎటువంటి పర్యవేక్షణ, ఎడిటింగ్ లేకుండా ఇష్టారాజ్యం అమలవుతున్నది.
ఈ చర్చను జర్నలిస్టుల లిస్టులు తయారు చేయడం ద్వారా పరిష్కరించడం అసాధ్యం. పేరుకు జర్నలిస్టు సంఘాలు అరడజనో, ఇంకా ఎక్కువో ఉన్నాయి గాని, మొత్తం జర్నలిస్టులలో సగం మంది అయినా ఈ సంఘాలలో సభ్యులుగా ఉన్నారా అనుమానమే. కనుక వాళ్ళతో లిస్టులు తయారు కావు. ప్రభుత్వం రాజధాని స్థాయిలో, జిల్లాల స్థాయిలో అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చి, గుర్తించే జర్నలిస్టులు ఉన్నారు గాని వారు మొత్తం జర్నలిస్టుల సంఖ్యలో పావు వంతు కూడా ఉండరు. కనుక అది కూడా లిస్టు కాజాలదు. పోనీ, ప్రచార సాధనాల సంస్థల యాజమాన్యాల దగ్గరి నుంచి ఉద్యోగుల జాబితాలు సంపాదించి జర్నలిస్టుల లిస్టు తయారు చేసినా అది కూడా సమగ్రం కాదు. యాజమాన్యాలు అనేక ఇతర అవసరాల కోసం జర్నలిస్టులు కానివారెందరినో తమ జర్నలిస్టు ఉద్యోగులుగా ప్రకటిస్తుంటాయి. పైగా ఏ సంస్థలోనూ ఉద్యోగి కాకుండా స్వతంత్రంగా జర్నలిస్టులుగా ఉన్నవారు రాష్ట్రంలో కొన్ని వందల మందో, వేల మందో ఉంటారు. కనుక అసాధ్యమూ అనవసరమూ అయిన జర్నలిస్టుల లిస్టు తయారు చేసే పని ముఖ్యమంత్రి మానుకోవాలి.
అలాగే సమాజంలో జర్నలిస్టులు, క్రిమినల్స్ అనే రెండు వర్గాలు మాత్రమే లేవనీ, ఆ రెండు వర్గాలు కూడా పౌరులు అనే ఒక పెద్ద సమాజంలో భాగమనీ ముఖ్యమంత్రి గుర్తించాలి. పౌరులలో ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ విధానాల గురించి ఆలోచించే, చర్చించే, ప్రశ్నించే అధికారం ఉంటుందని గుర్తించాలి. ఆ పౌరులలో ఒక చిన్న బృందం తమ ఉద్యోగ ధర్మం వల్ల, వ్యక్తీకరణ శక్తి వల్ల జర్నలిస్టులుగా ఉంటారని, వారు సమాజంలో వ్యక్తమయ్యే భావాలను ప్రచారంలోకి తెచ్చేవారు మాత్రమేనని గుర్తించాలి. అలా భావాలను వ్యక్తీకరించడం మనుషుల సహజాతమైన హక్కు అనీ, రాజ్యాంగం కూడా దాన్ని గుర్తించి, గౌరవించిందని అర్థం చేసుకోవాలి.
ఆ హక్కును వినియోగించుకునే క్రమంలో జర్నలిస్టులు, వారిని ఉపయోగించుకునే రాజకీయ పక్షాల వంటి స్వార్థపరశక్తులు ఆ హక్కును దుర్వినియోగం చేసే అవకాశం ఉందని కూడా గుర్తించాలి. ఆ దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి, విచారించడానికి, శిక్షించడానికి ప్రభుత్వానికి అన్ని అధికారాలూ ఉన్నాయనీ, కాని ఆ పేరు మీద మొత్తంగా జర్నలిజం మీద హుంకరించడం, బట్టలూడదీసి కొడతా వంటి అనుచిత భాష వాడడం తప్పు అనీ ముఖ్యమంత్రి గుర్తించాలి. ఎలుకలు దూరాయని ఇల్లు తగులపెట్టుకుంటామా అని ప్రాచీన తెలుగు వివేకపూ నుడికారం ఉంది, ఇప్పుడు ఎలుకలు మాత్రమే కాదు, పందికొక్కులు పడ్డమాట నిజమే. అయినా ఇల్లు తగులపెడతాననడం దూర్తత్వం.