Category తెలంగాణార్థం

ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారమైనట్టేనా?

రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 14 సోమవారం నాడు జారీ చేసిన నాలుగు జీఓ లు, అంతకు ముందు మార్చ్‌ 18న శాసనసభ ఆమోదించి, ఏప్రిల్‌ 9న గవర్నర్‌ ఆమోదం పొంది చట్టంగా తయారైన ది తెలంగాణ షెడ్యూల్డ్‌ కాస్ట్స్‌ (రేషనలైజేషన్‌ ఆఫ్‌ రిజర్వేషన్స్‌) చట్టం 2025, మూడు దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను, తెలంగాణాను నిరం తరంగా…

భూమి ప్రభుత్వానిది ఎలా అవుతుంది?

హైదరాబాద్‌ ‌విశ్వవిద్యాలయ భూవివాదంలో ఆర్టిఫిషియల్‌ ఇం‌టిలిజెన్స్ ‌ద్వారా తయారుచేసిన చిత్రం తప్పు అని ప్రభుత్వం పెద్ద ఎత్తున యాగీ చేస్తున్నది, తప్పుడు కేసులూ, అక్రమ నిర్బంధాలూ కూడా అమలు చేస్తున్నది. కాని ఆ చిత్రానికి దారి తీసిన పరిణామాలన్నీ పరిశీలిస్తే, ప్రభుత్వం చేసిన తప్పులూ, ఆడుతున్న అబద్ధాలూ, వాస్తవాలను తారుమారు చేయడమూ వంటి అనేక అంశాల…

రాజ్య హింసకు వత్తాసు పలుకుతున్న ‘మేతావులు’!

ఐదు దశాబ్దాల కిందనే ‘శిశు హంతక రాజ్యం ఇది, పశు సంతతి పాలన ఇది’ అని ఈ దేశపు రాజ్య స్వభావాన్నీ, పాలనా ప్రవృత్తినీ ఒక్కమాటలో చెప్పాడు చెరబండరాజు. అటువంటి రాజ్యంలో‘నేరమే అధికారమై/ ప్రజల్ని నేరస్తుల్ని చేసి వేటాడుతుంటే/ ఊరక కూర్చున్న/ నోరున్న ప్రతివాడూ నేరస్తుడే’ అన్నాడు వరవరరావు. యాబై ఏళ్ల కింద తెలుగు సమాజం…

కీచులాటలు మాని, కీలక సమస్యలపై మాట్లాడండి!

గత శనివారం చెన్నైలో ఒక అపూర్వ సమావేశం జరిగింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్‌ పూనిక మీద జరిగిన ఈ సమావేశంలో ఆయనతో పాటు కేరళ, పంజాబ్‌, తెలంగాణ ముఖ్యమంత్రులు, కర్ణాటక ఉపముఖ్యమంత్రి, పద్నాలుగు రాజకీయ పక్షాల నేతలు పాల్గొన్నారు. దేశ రాజకీ యాలలో భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్ట దలచిన కీలకమైన మార్పులను…

జర్నలిస్టుల లిస్టులు తయారు చేసేదెవరు?

 ‘‘ఉప్పు పాతరేస్తా…’’. ‘‘ఎవ్వరినీ వదలను.’’ ‘‘మీడియా మిత్రులను, సంఘాల నాయకులను అడుగుతున్నా. జర్నలిస్టులెవరో లిస్టు ఇవ్వండి. జర్నలిస్టు అనే పదానికి డెఫినిషన్‌ ‌చెప్పండి. ఆ లిస్టులో ఉన్నవాళ్లు ఇట్లా తప్పు చేస్తే మీరు ఏమి శిక్ష విధిస్తారో చెప్పండి. ఆ లిస్టులో లేనివాడు జర్నలిస్టు కాదు. క్రిమినల్స్ ‌గానే చూస్తాం. ఎట్ల జవాబు చెప్పాల్నో అట్లనే…

వరంగల్‌ కు గాలిమోటరూ, గాలి మాటలూ!

ఎట్టకేలకు వరంగల్‌ (మామునూరు) విమానా శ్రయం కదలిక ప్రారంభమయింది. రాష్ట్రంలో హైదరా బాద్‌ (శంషాబాద్‌) అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత రెండో విమానాశ్రయంగా వరంగల్‌ విమానా శ్రయం రాబోతున్నది. నిజానికి రెండో ప్రపంచ యుద్ధ కాలానికి ముందే 1930లలో నిర్మాణమైన ఈ విమానాశ్రయం ఇరవయో శతాబ్ది తొలి అర్ధభాగంలో దేశంలో ప్రధానమైన విమానాశ్రయాల్లో ఒకటిగా ఉండిరది. అది…

మనిషి ప్రాణం విలువ తెలిసిన సమాజమేనా?

నాలుగు రోజులుగా శ్రీశైలం లెఫ్ట్ ‌బ్యాంక్‌ ‌కెనాల్‌ ‌సొరంగంలో చిక్కుకుపోయిన అభాగ్యుల కోసం నిస్సహాయ ఆగ్రహం, ఓపలేని దుఃఖం పోటెత్తుతున్నాయి. శనివారం పొద్దున ఆ చీకటి గుయ్యారంలో దిగ్బంధంలోకి పోయిన ఆ ఎనిమిది మంది ప్రాణాలు ఇది రాస్తున్న సమయానికి ఇంకా నిలిచి ఉన్నాయో లేదో తెలియదు. వాళ్లను సజీవంగా బైటికి తీసుకు రాగలమా లేదా…

తెలంగాణ సామాజిక చరిత్రలో ఒక మలుపు

 ‘చారిత్రక విభాత సంధ్యల మానవ కథ వికాసమెట్టిది’ అని శ్రీశ్రీ అన్నమాట తనకు తాను వేసుకున్న ప్రశ్ననో, ఎవరికో వేసిన ప్రశ్ననో కాదు. అది ఎవరికి వారు చేసుకోవలసిన ఆలోచనా ధారకు మేల్కొలుపు. మానవ కథా వికాసం ఒంటరి మనిషిదీ కావచ్చు, ఒక కుదురుదీ కుటుంబానిదీ కావచ్చు, ఒక సమూహానిదీ సమాజానిదీ కావచ్చు. ఒక దేశానిదీ…

ఈ ఉన్మాదాన్ని అడ్డుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత

గత శనివారం నాడు హైదరాబాద్‌ ‌శివార్లలోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రాంగణంలోని ప్రధాన పూజారి రంగరాజన్‌ ఇం‌ట్లోకి రామరాజ్యం సేన నాయకుడు వీరరాఘవరెడ్డితో సహా దాదాపు ఇరవై మంది ఆగంతుకులు జొరబడ్డారు. ఆ దుండగులు దాదాపు నలభై నిమిషాల పాటు వయోవృద్ధుడైన రంగరాజన్‌ ‌ను, ఆయన కొడుకును వేధించారని, కొట్టారని, బూటు కాళ్లతో తన్నారని, దుర్భాషలాడారని…