Category తెలంగాణ

ఆహారంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి

టూరిజం ప్లాజాలో మంత్రి జూపల్లి ఆకస్మిక తనిఖీలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 17: టూరిజం ప్లాజా హోటల్స్‌లో పరిశుభ్రత పాటించాలని, ఆహారంలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్‌లో మంగళవారం ఉదయం ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. రెస్టారెంట్‌ అంతా…

సింగరేణి బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం

బొగ్గుతోపాటు ఇతర మైనింగ్‌ రంగాల్లోకి విస్తరించాలి సంస్థ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూన్‌ 17: భవిష్యత్తు తరాలకు ఉపాధిని అందించే 45 వేలకు పైచిలుకు ఉద్యోగులు ఉన్న రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి బలోపేతం కావడమే ప్రభుత్వ లక్ష్యం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. భూపాలపల్లిలోని సింగరేణి…

3 ఎకరాల వరకు రైతు భరోసా నిధుల జమ

– రూ.1551.89 కోట్లు విడుదల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 17: మూడెకరాల వరకు ఉన్న రైతులందరి ఖాతాలలోకి రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం జమచేసింది. ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతు భరోసా నిధులు మంగళవారం జమ చేశామని, అందుకోసం రూ.1551.89 కోట్లు విడుదల చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుగారు ఒక…

నెలవారీగా లక్ష్యాలను నిర్దేశించుకోవాలి

అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 17: నెలవారీగా లక్ష్యాలు నిర్దేశించుకుని పనిచేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. తన శాఖలకు చెందిన అధికారులతో మంత్రి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా జరుగుతున్న పనుల పురోగతిని, అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యకలాపాలను, హామ్‌ విధానంలో…

దిల్లీ తెలంగాణ భవన్‌లో హెల్ప్‌లైన్‌

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్‌ 17: ఇరాన్‌-ఇజ్రాయెల్‌ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న లేదా ప్రయాణిస్తున్న తెలంగాణవాసులు, విద్యార్థులకు సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఢల్లీిలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రెండు దేశాల భారత రాయబార కార్యాలయాల…

సంక్షేమం, అభివృద్ధి ఆగవు

భూపాలపల్లిలో డిప్యూటీ సీఎం భట్టి భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూన్‌ 17: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి ఘోరి మండలం చెన్నాపూర్‌లో నిర్మించిన 33/11 కేవీ సబ్‌ స్టేషన్‌ మంగళవారం పారంబోత్సవం జరిగింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రారంభోత్సవం చేశారు. జిల్లాలో రూ.8.70 కోట్ల విలువైన…

ప్రతి ఎకరాకు రైతు భరోసా

తొమ్మిది రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా జమ కాంగ్రెస్‌కు, వ్యవసాయానికి విడదీయరాని అనుబంధం బిఆర్‌ఎస్‌ నేతలు పదేళ్లు పంట నష్టం పరిహారం పట్టించుకోలేదు రైతు నేస్తం సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క    హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 16 : రానున్న తొమ్మిది రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలోని అన్నదాతల అందరి ఖాతాల్లోకి రైతు…

హరీష్‌రావుకు అస్వస్థత.. హాస్పిటల్ లో చికిత్స 

మాజీ మంత్రి హరీష్‌రావు అస్వస్థతకు గురయ్యారు. వైరల్‌ ఫీవర్‌ కారణంగా ఆయన బేగంపేట సన్‌షైన్‌ కిమ్స్‌ హాస్పిటల్ లో  చేరినట్లు సమాచారం. కేటీఆర్‌ ఏసీబీ విచారణ నేపథ్యంలో హరీష్‌ ఉదయం నుంచి సాయంత్రం వరకు తెలంగాణ భవన్‌లోనే ఉన్నారు. అక్కడే అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ను హుటాహుటిన హాస్పిటల్ కు తీసుకెళ్లారు.

జీహెచ్‌ఎంసీ వద్ద టెన్షన్‌ టెన్షన్‌

కార్యాలయం వద్ద బీజేపీ నేతల ఆందోళన   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 16: నగరంలోని జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద సోమవారం ఉదిక్త్ర వాతావరణం నెలకొంది. నగర సమస్యలపై అధికారులను నిలదీసేందుకు బల్దియా కార్యాలయానికి భారీగా తరలివచ్చిన బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. తరలివచ్చారు. వీధి దీపాలు, రోడ్ల సమస్యలతో పాటు డివిజన్‌లోని సమస్యలు పరిష్కరించాలంటూ…