అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17: నెలవారీగా లక్ష్యాలు నిర్దేశించుకుని పనిచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. తన శాఖలకు చెందిన అధికారులతో మంత్రి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా జరుగుతున్న పనుల పురోగతిని, అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యకలాపాలను, హామ్ విధానంలో రోడ్ల నిర్మాణం, ఇందిరా మహిళా శక్తి, స్త్రీ నిధి, మిషన్ భగీరథ, ఉద్యోగుల పెండిరగ్ సమస్యలపై విభాగాధిపతులు ప్రజెంటేషన్లు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అత్యంత కీలకమైనది.. రెండు వేల కోట్ల మంది ప్రజల కు ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖ.. ఇంతకుముందు ఈ శాఖలో కార్యదర్శిగా పనిచేసిన అధికారులు పదోన్నతు లు పొందారు.. మంత్రి, ఉద్యోగులు వేరువేరు కాదు.. మంత్రి నుంచి మల్టీపర్పస్ వర్కర్ వరకు అందరూ ఒక కుటుంబంగా పనిచేసి గ్రామాలను అభివృద్ధిపరచాలని ఉద్బోధించారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ శాఖలో పనితనాన్ని మెరుగుపరుస్తూ శాఖకు నూతన కార్యదర్శి శ్రీధర్ మంచి పేరు తెస్తారనే నమ్మకం ఉందన్నారు. వరంగల్ కలెక్టర్‌గా, సింగరేణి సిఎండిగా తన నియోజకవర్గ అభివృద్ధికి ఆయన ఎంతగానో సహ కరించారన్నారు. అదేవిధంగా మన శాఖకు వన్నె వచ్చేలా శ్రీధర్ పనిచేస్తారని ఆశిస్తున్నానన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తూ వస్తున్నాం.. తాము అధికారంలోకి వచ్చాక ఎన్నో ఉద్యోగ సమస్యలను పరిష్కరించాం.. 93 వేల గ్రామస్థాయి ఉద్యోగులకు గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతినెలా జీతాలు చెల్లిస్తున్నాం.. ఎంపీడీవోల బదిలీల ఫైలు సీఎం వద్ద ఉంది,. ఎంపీడీవోలకు వాహనాల అలవెన్స్ ఫైల్ ఆర్థిక శాఖ వద్దకు చేరింది.. ఈ రెండు ఫైళ్ళకు కొద్దిరోజుల్లో క్లియరెన్స్ వస్తుంది అని వివరించారు.
కాగా, గ్రామాల్లో రహదారుల నిర్మాణం కోసం నూతన విధానం తీసుకొచ్చామని, గతంలో జరిగిన కేబినెట్ సమావేశంలో హామ్ విధానానికి ఆమోదం లభించిందని, ఈ విధానం ద్వారా గ్రామీణ రోడ్లకు వహర్దశ పట్టనుందని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మార్గదర్శకాలతో నేడో ంపో జీవో విడుదల చేస్తామన్నారు. ఈ విధానం ద్వారా మొత్తం 18,472 క.మీ మేర గ్రామీణ రహదారులను ఆధునీక రిస్తామని వివరించారు. 15 రోజుల్లో టెండర్లు వేసేందు కు అధికారులు కార్యాచరణ రూపొందించాల న్నారు. ఉపాధి నిధుల ద్వారా ఇప్పటికే రూ.1800 కోట్ల పనుల ను మంజూరు చేశామని, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పను ల జాతరను ప్రారంభిస్తామని మంత్రి సీతక్క పేర్కొన్నా రు. ఈ దఫా గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడి భవనాల నిర్మాణానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామ న్నారు. ప్రతి మండలానికి రెండు చొప్పున మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 1440 జిపి భవనాలను, 1440 అంగ న్వాడి భవనాలను ఈ ఏడాది నిర్మిస్తామంటూ గత ఏడాధి చేపట్టిన పనుల జాతర సక్సెస్ అయిందిదని చెప్పారు. ప్రజలకు ఉపాధి కల్పనతోపాటు పల్లెల్లో ఆస్తు లను సృష్టించామన్నారు. పంట పొలాలకు మట్టి రోడ్ల నిర్మాణం వంటి వ్యవసాయ అనుబంధ పనులను ఎక్కువగా చేపడుతున్నామని చెప్పారు.
మంత్రి సీతక్కను కలిసిన శ్రీధర్
అంతకుముందు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్ర టరీగా బాధ్యతలు స్వీకరించిన ఎన్.శ్రీధర్ రాష్ట్ర సచివాలయంలో మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి సీతక్క ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త బాధ్యతల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు.