Category ప్రత్యేక వ్యాసాలు

“గణితంలో దిట్ట – సిద్ధాంతాలలో పుట్ట” మన రామానుజన్ !

బ్యాంకు ఎటియం కేంద్రానికి వెళ్లి మనం ఎంత మొత్తంలో డబ్బు కావాలో అంతే పరిమాణంలో వివిధ డినామినేషన్లో ఆ యంత్రం అందిస్తుంది. అలాగే అంతరిక్షంలో ఉపగ్రహాన్ని మనకు కావలిసిన రీతిలో ప్రవేశపెడతాం. ఇటువంటి అనేక రంగాలలో మన దేశానికి చెందిన ప్రముఖ గణిత మేధావి రూపొందించిన సిద్దాంతాలు ఉన్నాయి. ఆయనే శ్రీనివాస రామానుజన్. ఈయన గణితంలో…

రాజకీయ పార్టీల పెత్తనానికి కళ్లెం వేయాలి!

 ప్రజాధనం వృధాను అరికట్టగలగాలి అన్ని రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా చట్టాలను మార్చు కుంటున్నారు. రాజకీయ సంస్కరణల విషయంలో అన్ని పార్టీలదీ ఒకటే దారి.  అన్నీ ఒకే తాను ముక్కలు గనక వాటి గురించి అంతా తలూపుతున్నారు. ఇప్పుడు జమిలి ఎన్నికల విషయంలో రాజీపడ్డట్లు కనిపించినా అందరికీ అవసరమే. కాకపోతే తరచూ ఎన్నికలను రాజకీయ పార్టీలు…

సరస్సులు, చెరువుల పునరుద్ధరణకు పూనుకోవాలి!

సరస్సులు, చెరువులకు కొత్త శోభ.. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చి ఏడాది పూర్తయ్యింది. అయితే ఆరు గ్యారెంటీలు అమలు కాలేదు. మంత్రుల మధ్య సమన్వయం కనిపించడం లేదు. అలాగే ప్రతి విషయానికి దిల్లీ  నుంచి అనుమతి తీసుకోవాల్సిన దుస్థితి తప్పడం లేదు. అక్కడికి వెళ్లి దర్శనం చేసుకోవడం తప్పడం లేదు. హావిరీలపై విపక్షాలు నిలదీస్తున్నాయి. కాంగ్రెస్‌…

వ్యవసాయ రంగంలో సంస్కరణలు రావాలి!

కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలి!  వ్యవసాయాభివృద్దికి తక్షణ చర్యలు అవసరం వ్యవసాయ చట్టాలు తీసుకుని వొచ్చినప్పుడు ప్రధాని మోదీ కనీసం ఏ ఒక్కరితోనూ చర్చించలేదు. దేశవ్యాప్తంగా నిరసనలు రావడంతో దానిని వెనక్కు తీసుకున్నారు. అప్పుడు చట్టంలోని మంచిని గానీ చెడును గానీ పార్లమెంటులో కనీసంగా అయినా చర్చించలేదు. ఈ క్రమంలో  పంటలకు అందిస్తున్న కనీస…

కొత్త చట్టాలను స్వాగతించాల్సిందే….!

 పాత, కొత్త చట్టాలపై సమగ్ర అవగాహన అవసరం దేశానికి అనుగుణంగా చట్టాల రూపకల్పన జరగాలి కనుమరుగు కానున్నభారత సాక్ష్యాధార చట్టం పాలకులు వారి అవసరాలకు అనుగుణంగా మార్చుకుంటున్న చట్టాలను కూడా చర్చించాలి. చట్టం ఎవరికైనా ఒక్కటే అన్న భావన ప్రజల్లో రావాలి. రాజకీయ నాయకులు చట్టాల నుంచి తప్పించుకోకుండా కఠిన చర్యలు తీసు కోవాలి. బాధితులకు…

వేగానికున్న ప్రాధాన్యత భద్రతకు ఏదీ?

riding bikes and don't need helmets

చిన్నపాటి నిర్లక్ష్యమే భారీ మూల్యానికి  కారణం బైక్‌ నడపడంలో తాము నేర్పరులమని, హెల్మెట్‌ అవసరం లేదని, ఇది శిరోభారమని భావించేవారు మనలో చాలా మందే ఉన్నారు. హెల్మెట్‌ భారం కాదు అది ఒక రక్షణ కవచం. యువత బైక్‌ ఎక్కితే చాలు రయ్‌ రయ్‌ మని దూసుకుపోతుంటారు. మితివిూరిన వేగం, మద్యం మత్తులో నడపడం, ట్రాఫిక్‌…

వెనుకబడిన వర్గాల ప్రయోజనాలు తాకట్టు పెట్టారు

దేశమంతా సమగ్ర కులగణన చేపట్టని  పార్టీ నుంచి  వెనుకబడిన కులాల ప్రతినిధి ఆర్‌ క్రిష్ణయ్య  పెద్దల సభకు  పంపారు. మొన్నటి వరకు వైసీపీలో ఎంపీలు గా వెలగబెట్టిన  ఆర్‌ క్రిష్ణయ్య, బీద మస్తాన్‌ రావు, మోపిదేవి వెంకటరమణ  ఇప్పుడు కండువా మార్చి తెలుగుదేశం బీజేపీ పంచన చేరి   ప్రాతినిధ్యం వహిస్తున్నారు.   ఏటా  రెండు…

ప్రశ్నార్ధకంగా పక్షుల మనగడ!

నేడు నగర వాతావరణంలో పక్షుల మనగడ కష్టమవుతోంది. ప్రశ్నార్ధకంగానూ మారుతోంది. ఇప్పటికే అనేక రకాల పక్షులు నగరాల్లో కనుమరుగయ్యాయి. అయితే పావురాలకు మాత్రం ఇది వర్తించదు. పల్లె ప్రాంతాల్లో కన్నా నగరా ల్లోనే మనం పావురాలను ఎక్కువగా చూస్తాం. సిటీస్‌లో వాటికి నీరు, ఆహారం అందుబాటులో ఉంటాయి. వాటిని చంపితినే జంతువులు దాదాపు ఉండవు. ఉన్నా చాలా తక్కువ. వీటికి తోడు ఎత్తయిన బిల్డింగులు, కిటికీలు, పైకప్పులు, వంతెనలు, ఫ్లైఓవర్లు, గోదాములు..ఇలా ఒకటేంటి, అవి నివసించడానికి ఎన్నో అనువైన ప్రదేశాలున్నాయి. అయితే, మెట్రో సిటీస్‌లో వీటి సంఖ్య పెరగటం మనుషులకు ప్రమాదంగా పరిణమిస్తోంది. పావురాల వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలను పరిగణనలోకి తీసుకున్న పుణె మున్సిపల్‌ కార్పొరేషన్‌, వాటిని పోషించే వారిపై చర్యలు ప్రారంభించింది. పావురాల రెట్టలు, ఈకలు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. వీటితోపాటు చర్మ సమస్యలు, అలర్జీలు, సైనసైటిస్‌ ప్రమాదం పెరుగుతుంది. కానీ, ఏదైనా ఒక జీవి జనాభా విపరీతంగా పెరిగితే అది పర్యావరణంపైనా ప్రభావం చూపుతుంది. పావురాల సంఖ్య పెరగడం పర్యావరణంలో అసమ తుల్యతకు సంకేతం. పావురాలు స్థానిక జాతులే. ఇళ్లలో పెంచుకోవడానికి పావురాలను మనుషులు అడవుల నుంచి గ్రామాలు, పట్టణాలకు తీసుకొచ్చారు. అంతకు ముందు అవి కొండా కోనల్లో తిరుగుతూ, పెద్ద పెద్ద బండరాళ్ల మధ్య గూళ్లు పెట్టుకుని జీవించేవి. చిన్న చిన్న పురుగులు, పండ్లు తిని బతికేవి. వీటి రెట్టల ద్వారా పండ్ల విత్తనాలు అడవి అంతటా వ్యాపించేవి. కానీ, ఇప్పుడు పక్షులకు అడవులలో తిండి సరిగా దొరకడం లేదు. పావురాలను డేగలు, గద్దలు వేటాడి చంపి తింటుంటాయి. తోడేళ్లు, నక్కలకు కూడా ఇవి చాలా ఇష్టమైన ఆహారం. తరచూ మనుషులు కూడా వీటిని వేటాడుతుంటారు. ఇంతకు ముందు ఈ పక్షులు అడవుల్లో చాలా ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు చాలా తగ్గాయి. నగరాల్లో వీటికి శత్రువులు పెద్దగా లేకపోవడం, రక్షణ ఎక్కువగా ఉండటం వాటి సంఖ్య పెరగడానికి కారణమైంది. పైగా ప్రజలు వాటికి తిండిగింజలు వేస్తూ వేటాడే శ్రమను తగ్గిస్తున్నారు. దీంతో సహజంగానే సంతానోత్పత్తి సులభమవుతోంది. పౌల్ట్రీలలో కోళ్లు పెరిగినట్లే, ఇక్కడ పావురాలు కూడా పెరుగుతున్నాయి. నగరాలు పెద్ద పౌల్ట్రీ ఫామ్ గా మారాయి. పావురాల సంఖ్య పెరిగేకొద్దీ ప్రకృతిలోని ఇతర జీవులపై దాని ప్రభావం పడుతుంది. ఇవి తమకంటే చిన్నసైజులో ఉండే పిచ్చుకల్లాంటి వాటిని వేధిస్తుంటాయి. అవి కట్టుకున్న గూళ్లను ఆక్రమిస్తుంటాయి. వాటి ఆహారాన్ని తినేస్తాయి. దీనివల్ల ఆహారపు కొరతతో చిన్నపక్షులు నశిస్తుంటాయి. ఒక్క పావురానిదే కాదు, ఏ పక్షి మల మూత్రాలైనా మన చుట్టూ ఎక్కువగా ఉంటే, అవి మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఇక, పర్యావరణంలో పావురాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, అవి పెద్ద సంఖ్యలో పెరగడం వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఏ ప్రదేశంలో ఎన్ని పక్షులు నివసించాలి అన్నదానిపై ఒక నిర్దిష్ట పరిమితి ఉంది. ఒక రకం జీవరాశి అధికంగా పెరిగితే, దానివల్ల ఇతర జీవులకు లభించే ఆహారం, నివాసం, ఎగిరే స్థలం తగ్గుతాయి. అది వాటి జనాభా విూద ప్రభావం చూపిస్తుంది. పావురాలు అన్ని పరిస్థితులను తట్టుకుంటాయి. కొన్ని ఇతర పక్షుల మాదిరిగా కాకుండా, ఏ సమయంలోనైనా గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేయగలవు. నివాసానికి అనుకూల స్థలం, పుష్కలంగా ఆహారం, వేటాడే జంతువులు లేకపోవడంలాంటివి పావురాలు విపరీతంగా పెరగడానికి కారణమవుతున్నాయి. ఇప్పుడు నగరాలలో చాలా ప్రాంతాలను పావురాలు ఆక్రమించినట్లు కనిపిస్తుంది. వీటి కారణంగానే కాకులు, పిచ్చుకల్లాంటి కొన్ని పక్షులు కనిపించకుండా పోతున్నాయి. అయితే పావురాల సంఖ్య పెరగడం వల్లే ఇతర పక్షుల తగ్గిపోతున్నాయని చెప్పడం పూర్తిగా నిజంకాకపోవొచ్చు. పట్టణీకరణతోపాటు, మరికొన్ని ఇతర కారణాల వల్ల కూడా ఇలాంటి పక్షులు కనుమరుగవుతున్నాయి. ఈ రెండింటిలో ఏది ఎంత వరకు కారణమన్నదాన్ని పరిశోధించాల్సి ఉంది. -మహేందర్ మిట్టపల్లి

నేడు నగర వాతావరణంలో పక్షుల మనగడ కష్టమవుతోంది. ప్రశ్నార్ధకంగానూ మారుతోంది.  ఇప్పటికే అనేక రకాల పక్షులు నగరాల్లో కనుమరుగయ్యాయి. అయితే  పావురాలకు మాత్రం ఇది వర్తించదు. పల్లె ప్రాంతాల్లో కన్నా నగరా ల్లోనే మనం పావురాలను ఎక్కువగా చూస్తాం. సిటీస్‌లో వాటికి నీరు, ఆహారం అందుబాటులో ఉంటాయి. వాటిని చంపితినే జంతువులు దాదాపు ఉండవు. ఉన్నా…

ప్రతి రోజూ కావాలి పుస్తకాల పండుగ!

ఇవాళ్టి నుంచి పదకొండు రోజుల పాటు హైదరాబాద్ బుక్ ఫేర్ అనే పుస్తకాల పండుగ జరగబోతున్నది. ‘ఈ రోజుల్లో పుస్తకాలు చదివే చాదస్తులెవరండీ’ అని సన్నాయి నొక్కులు నొక్కే వారుంటారు. పుస్తకమే శ్వాసగా ధ్యాసగా ప్రాణంగా ప్రపంచంగా బతుకుతున్నవాళ్లూ ఉంటారు. ముప్పై ఆరు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం జరుగుతున్న పండుగే గనుక ఇందులో కొత్త ఏమున్నది…