Category ప్రత్యేక వ్యాసాలు

రాజకీయాల్లో మెరుస్తున్న ‘కాక్రోచ్’

 “ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు దేశ విద్యార్థులు యువత, మహిళలు, కార్మికులు, రైతులు ఎదురు చూస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో దేశంలో ఏదో మార్పు జరగబోతోంది అనే భ్రమలు కల్పించడమే లక్ష్యంగా సోషల్ మీడియాలో గాలివాటం పార్టీలు రాత్రికి రాత్రే పుట్టుకొస్తాయి. పాలక, ప్రతిపక్షాలకు వాటి అవసరం తీరిపోయాక రాత్రికి రాత్రే వాటిని మాయం చేస్తాయి. ప్రశ్నించే గొంతులను నొక్కడం…

శిక్షించే చట్టాల కంటే రక్షించే అవగాహన మిన్న

“గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో అవగాహన లోపం కారణంగా ఎంతోమంది సాధారణ కుటుంబాలు తెలియకుండానే చట్టపరమైన చిక్కుల్లో చిక్కుకుంటున్నాయి. అటువంటి సందర్భాల్లో తరచూ వినిపించే చట్టాల్లో పోక్సో ఒకటి. 18 సంవత్సరాల లోపు పిల్లల రక్షణ కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. దేశంలో బాల్యవివాహాలు తగ్గుముఖం పట్టినా సమస్య పూర్తిగా తొలగిపోలేదు.” “చట్టం దృష్టిలో అందరూ సమానులే”…

“ఏకు + మేకు = షేకు” నుండి నేటి భారతం దాకా 

“నేడు భారతదేశం ఎదుర్కొంటున్న ప్రశ్న కూడా అదే, అధికారం ఎవరి చేతిలో ఉంది అనేది కాదు; ఆ అధికారం రాజ్యాంగ పరిమితులలో,  ప్రజాస్వామ్య విలువలలో, సమాఖ్య సమతుల్యతలో నడుస్తుందా లేదా అనేదే అసలు ప్రశ్న.చరిత్రను చదవడం అంటే గతాన్ని జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు. వర్తమానాన్ని అర్థం చేసుకొని భవిష్యత్తును జాగ్రత్తగా నిర్మించుకోవడం కూడా. 1977లో…

అగ్నిప్రమాదాల పునరావృతం వెనుక బాధ్యతలేని పట్టణీకరణ

దిల్లీలో జరిగిన తాజా అగ్నిప్రమాదం మరోసారి దేశాన్ని విషాదంలో ముంచింది. ప్రాణనష్టం, ఆస్తినష్టం, అధికారుల తనిఖీలు, విచారణ కమిటీలు, పరిహార ప్రకటనలు. ఇవన్నీ ప్రతీ పెద్ద అగ్నిప్రమాదం తర్వాత కనిపించే దృశ్యాలు ఇవే. కొన్ని రోజులు చర్చ జరుగుతుంది. బాధ్యుల కోసం వెతుకులాట సాగుతుంది. ఆ తర్వాత మరో ప్రమాదం వరకు అంతా మామూలే. కానీ ఒక…

పౌర హక్కుల కోసం పరితపించిన మేధావి బాల గోపాల్

“ఆదివాసీ ఉద్యమం నుంచి విప్లవోద్యమం వరకు, పౌరహక్కుల ఉద్యమం నుంచి మానవ హక్కులు ఉద్యమం వరకు, కూలీ పోరాటం నుంచి భూపోరాటం వరకు అన్నిరకాల ఉద్యమాలతో పెనవేసుకు పోయిన నాయకు డాయన. ఎక్కడ అన్యాయం, వివక్ష, అణిచివేత, అసమానతలు కనిపించినా నిష్కర్షగా, నిక్కచ్చిగా, నిర్భయంగా పోరాడాడు. ఈ క్రమంలో వచ్చిన బెదిరింపుల్ని ఏనాడూ లెక్కచేయలేదు. ఆయనపై…

పసిప్రాయంలోనే లైంగిక క్షోభ!

“గృహహింస మరియు పితృస్వామ్య వైఖరి కేవలం నిరక్షరాస్యులైన పల్లె ప్రజలకే పరిమితం కాలేదు. అక్షరాస్యతలో, సామాజిక చైతన్యంలో దేశంలోనే మొదటి వరుసలో ఉంటాయని మనం భావించే కేరళ, గోవా, మిజోరాం వంటి రాష్ట్రాలతో పాటు లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల వంటి కేంద్రపాలిత ప్రాంతాలలో గత సర్వే కంటే హింస పెరగడం అత్యంత విస్మయానికి గురిచేస్తోంది.…

హేతుబద్దం కాని హేతుకీకరణ

 “27 లక్షల ఎనభై వేల మంది విద్యార్థుల కు రవాణా సౌకర్యం కోసం యేటా ఖర్చు చేసేందుకు నిధులు ఎలా సర్దుతారన్నది తెలియదు.ఊర్లో బడి ఉండగా,బడి ఆవాస ప్రాంతంలో బడి ఈడు పిల్లలుండగా ఆ బడిని మూసి ఆ ఊరి పిల్లలను బస్సులెక్కించి వేరే ఊరి  బడికి పంపడం సహేతుకం ఎలా అవుతుందో ఆయన వివరించాల్సి…

వోటుబొండిగలో సర్కార్ చేప!

“హైదరాబాద్ చేప ప్రసాదం అనేది విశ్వాసం, విజ్ఞాన శాస్త్రం మధ్య ఉన్న గీతను చెరిపేసే ఒక ప్రయత్నం. 180 ఏండ్ల క్రితం ప్రారంభమైన ఒక చిన్న కుటుంబ సంప్రదాయం, నేడు ప్రభుత్వ అండదండలతో ఒక భారీ సామాజిక వేడుకగా మారింది. అయితే శాస్త్రీయ ఆధారాలు లేకపోవడం, ఆరోగ్య ముప్పులు పొంచి ఉండడం రాజ్యాంగబద్ధమైన శాస్త్రీయ దృక్పథానికి…

తమిళనాడులో కొత్త రాజకీయ యుగం ప్రారంభమవుతోందా?

“బీజేపీ గత పన్నెండేళ్లలో దక్షిణ భారతదేశంలో స్వతంత్ర రాజకీయ బలాన్ని నిర్మించడంలో పరిమిత విజయాలే సాధించింది. కర్ణాటక మినహా ఇతర రాష్ట్రాల్లో అది ప్రధాన ప్రత్యామ్నాయంగా ఎదగలేకపోయింది.దీనికి ప్రధాన కారణం దక్షిణ భారత రాజకీయ-సాంస్కృతిక వాస్తవాలు. తమిళనాడులో దేవాలయాలు, ఆధ్యాత్మిక సంప్రదాయాలు, మత విశ్వాసాలు బలంగా ఉన్నప్పటికీ, ఉత్తర భారత సాంస్కృతిక-రాజకీయ నమూనాలను ప్రజలు యథాతథంగా…