అన్నిటా సగం

నీవో సగం, నేనో సగం ఆకాశంలో, అవనిలో అన్నిటా మనం చెరి సగమంటూ తాయిలాల మాటలతో అనాదిగా మీరంటున్న సగానికేకాదు అసలు మా అస్తిత్వానికే సవాలుగా మిగిలిపోయాము అబలలమై ! నిన్ను అన్నగా, నాన్నగా, తాతగా, మామయ్యగా, బావగా తలచి చెల్లినై, కూతురినై, మనుమరాలిగా, కోడలిగా, ముద్దుల మరదలిగా బహురూపాలుగా విస్తరించి ప్రేమను, కరుణను పంచగల…








