పాలపిట్ట సొత్తు

నారింజ పండు బొటనవేలు

ఎగరేసిన పావళ బిళ్ళ వాడు

మోడిపండు చేతిలో పుర్రెలేని తోలు బొమ్మ

పూటకో ఏషం

ఏషానికో డైలాగ్ మార్చెటోడు

సద్ది తిన్న రేవును

నీడనిచ్చిన జెమ్మిచెట్టును తలుసుకొని బతుకాలి

ఆత్మగల్ల చెట్టును ఆగం జెయ్యాలని జూత్తె

అగ్గి కురిపించె అతారలను ఎత్తుకుంటది

బంగారు పూలతో పునాదిగ పేర్చుకున్న

మట్టిపూల బతుకమ్మను అవమానిస్తే

గునకపూలు, రుద్రాక్ష పూలు, బంతిపూలు

తీరొక్క పూవులై తిరుగబడుతయి

మా అవ్వ చేతిలో చెమట పూల

బతుకమ్మను మాయం జెసినోడు

మా ఊరు దొరయినా, బయటి దొంగయినా

వాళ్ళ  పెత్తనాలకు మట్టి కప్పుడే

ఈ మట్టి కనుగుడ్ల కలల పాట పాడే

గొంతుకలేదే జాగీరు

బందెల దొడ్డిలో  నోరుమెదపని

చెట్టు మీది కొంగలది అసలే కాదు

బంజరు భూముల్లో

మల్లెపూలను పండించే

పాల పిట్టలదే ఈనేల సొత్తు.

కోడం కుమారస్వామి 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *