ఎంత తోడినా
తరగని నీళ్లు –
అమ్మ ఓ కన్నీటి బావి
*
ఎప్పుడూ వానే
అమ్మానాన్నల కళ్లల్లో
పిల్లల్ని తడవనిచ్చేవాళ్లుకాదు
*
తుపాకీ శబ్దం
చిలుకలు వాలిన చెట్టు
తిరిగి మోడైంది
*
తెరిచి చూడాలేగానీ
అనంతమైన ఆకాశం
హైకూ కిటికి
*
మూడు ముక్కలేనా
నాలుగు దిక్కులు
హైకూ
-చిత్తలూరి





