శిక్ష

ముళ్ళకంపలు అరచేతి నిండా మొలిచినట్టు కంపరం అమాంతంగా బరువెక్కిన కుడి చేతివేళ్ళ చివర్లనుండి కన్నీరు కారుతోంది సొంత బిడ్డల్ని దండించే ప్రాణి సృష్టి మొత్తానికి మనిషొక్కడేనేమో ఖరారుగా చెప్పగలను నీ చెంప నొప్పి కంటే నా గుండెకి కలిగిన నొప్పి రెండింతలని పశు వాసనతో అరచేతి పశ్చాత్తాపం ఇదే ఆఖరు కావాలి చిన్నా, ఇంకెప్పుడూ చెయ్యెత్తను…








