Category సాహిత్యం-శోభ

బాధకు అర్థం చెప్పే ‘అనిమేష’

చెమ్మ:   – వారాల ఆనంద్ నందిని సిధారెడ్డి తెలంగాణ నేలలో పుటిన కవి. అదే నేల శ్వాసను అక్షరాల్లో నింపిన కవి కూడా. ఆయన కవిత్వం ఆ  ప్రాంతపు చరిత్ర, అక్కడి ప్రజల సంఘర్షణకు ప్రతిధ్వనీ ప్రతిబింబం. పల్లె జీవితం, రైతు బాట, దుమ్ము, దూళి చెరువు, బీడు ఇవన్నీ ఆయన పొందిన బాల్యానుభవాలే కాదు, ఆ తర్వాతి కాలంలో ఆయన కవిత్వానికి మూలాధారాలు కూడా అయ్యాయి. యువకుడిగా ఉన్నప్పుడే కవిత్వం వైపు ఆకర్షితుడయ్యారు. వాస్తవంగా చెప్పాలంటే ఆయన కవిత్వం కేవలం పుస్తకాల నుంచి…

ఒక నిస్సహాయ గానం

పలకరించే పక్షులు పచ్చని చెట్లు అలాయ్ బలాయ్ అరుచుకునే ముచ్చట్లు అన్నీ కరువై ఊరుమ్మడి బతుకుల్లో కలహభోజనుల మందెక్కిన సందడి అసలు కాకులే కరువైనని ఆ ఇంటిమీది కాకి ఈ ఇంటిమీద ఎక్కడ వాలుతుంది కనుక పక్షుల సంగీత కచేరీలో సైతం శృతి లేని తీరొక్క తీరు గాత్రo మన తత్వం మరిచి మనస్తత్వం చంపుకొని…

నేను రైటర్స్ మీట్ ప్రొడక్ట్ -కరుణ కుమార్

తొలిసారి రైటర్స్ మీట్ కు 2017 లో ఒక విద్యార్థిగా, పాఠకుడిగా హాజరయ్యాను. సూర్యలంకలో జరిగిన ఆ మీట్ నా జీవితంలో గొప్ప మలుపు. గొప్ప గొప్ప కథకులను దగ్గరగా చూసే, వినే అదృష్టం, నేర్చుకునే వీలుతో పాటు సాహిత్యంలో స్నేహితులను సంపాదించుకోగలిగాను. ఆ ఉత్సాహంతో రాసిన మొదటి కథ చున్నీ. అక్కడినుండి ఈరోజు వరకు…

నా అదృష్టంగా భావిస్తున్నాను

తెలుగు సాహిత్యరంగంలో ‘రైటర్స్ మీట్‘ అగ్రశ్రేణి రచయితల నుండి వర్ధమాన రచయితల వరకు అందరినీ ఏకం చేసే అద్భుతమైన వేదిక. రజతోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో, ఎనిమిదేళ్ళుగా కోర్ టీమ్ సభ్యురాలిగా ఈ ప్రయాణంలో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడి ఇన్ ఫార్మల్ చర్చలు, సీనియర్ల అనుభవాలు, నవతరం ఆలోచనలు నాలో విస్తృతమైన మార్పును…

ఒక బంధానికి సిల్వర్ జూబ్లీ

ఒక బాంధవ్యానికి పాతికేళ్ళు. తెలుగు కథాపరిణామక్రమాన్ని దఖలు చేస్తుంది ఇదంతా. తెలుగు నేలలో ట్యాంక్ బండ్ తడి గడ్డి పరకలపైన, హైదరాబాద్ పాత చలిలా మొలకరించింది, చిలకరించింది, అవతరించింది రైటర్స్ మీట్. తెలుగు కథ విస్తరించడంలో విస్తరాకులు కుట్టింది, తోరణాలు కట్టింది, దీపధారులను అక్కున చేర్చుకొని కాగడాలకు తైలం దిద్దింది. జ్యోతి రగిల్చింది. కథా రచన…

మంది చేసిన మేలు

నిన్నటి పని ఈరోజుకి పాతబడి రిలవెన్స్ కోల్పోతున్న వేగవంతమైన లోకంలో ‘రైటర్స్ మీట్’ కథల కోసం పాతికేళ్ళుగా నిలబడింది. ఈ మైలురాయిని ఉత్సవభరితంగా దాటుతున్నది.  మార్చ్ 14, 15 తేదీల్లో హైదరాబాద్ లో జరుగనున్న రైటర్స్ మీట్ రజతోత్సవ వేడుకలలో పాల్గొంటున్న కొందరు కథకుల సంతోషం వారిమాటల్లో- శోభ పాఠకుల కోసం. ఒక వయస్సు దాటాక,…

మా యింట్లో కవిత్వం!

-బమ్మిడి జగదీశ్వరరావు “ప్రతి మనిషిలోనూ కవి వుంటాడు” అన్నాడు మాటల్లో కవి. “కవిలో మామూలు మనిషి వుంటే మరింత బావుంటుంది” అన్నాన్నేను. “సరే వెతుకుదాం” అన్నాడు కవి. ఉపిరి శబ్దం వినిపించినంత నిశ్శబ్దం అయ్యింది మా యిల్లు. “నేను నడక నేర్చుకున్నాకే పడిపోవడం తెలిసింది” అన్నాడు కవి. “పడుతూ లేస్తున్నాకే మొకాలడ్డడం తెలిసింది” అన్నాను నేను.…

‘అంపశయ్య’ మానసిక అంతర్ముఖ యాత్ర

“మనసుని హత్తుకున్న నవల, కథ, కవిత మరే ఇతర ప్రక్రియ నుంచయినా ఒక రచనని ఎంచుకుని వారం వారం ‘శోభ’ పాఠకుల కోసం పరిచయం చేసే శీర్షిక ‘చెమ్మ’ దీనిని రచయిత, విమర్శకుడు, అనువాదకుడు అయిన వారాల ఆనంద్ నిర్వహిస్తారు.” అంపశయ్య 1969లో ప్రచురితమైన నవల. మొదట సృజన త్రైమాసిక పత్రికలో రెండుభాగాలుగా ప్రచురితమై ఆ తర్వాత…

ఆమె పయనం..

ఆమె.. తన గతానుభవాల పునాదిపై వర్తమానపు విశ్లేషణతో ఆశలను నిత్యనూతనం చేసుకుంటూ ఆచితూచి భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్నది.. నడిచే దారిలో ఎదురయ్యే ముళ్ళు రాళ్ళ అవరోధాలను అధిగమిస్తూ అలుపెరుగని బాటసారియై తన గమనాన్ని నిర్దేశించుకుంటున్నది.. అడుగడుగునా అవమానాల నిప్పురవ్వలు ఉవ్వెత్తున ఎగజిమ్ముతున్నా తట్టుకొని తలెత్తుకొని నిలబడి తన ఉనికిని చాటుకుంటున్నది.. అంతరంగంలో ఉద్వేగాల కన్నీటి…